Venkateswarlu
Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, స్కిల్ డెవలప్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 19న హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవించింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇక, ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్ట్ సాయి విశ్లేషణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ సుప్రీం కోర్టులో హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రాలు పెద్ద తలకాయలు. వారు అక్కడ బిగ్ బుల్స్. అలాంటి వాల్లే తమ వాదనలు వినిపించాక కూడా.. చంద్రబాబు గారికి క్వాష్ కాలేదంటే.. ఇక ఆశామాషీ కాదు. బాబు గారు ఇప్పుడు వస్తే రావాలి. లేదంటే అ చట్రంలో చిక్కుకున్నట్లే.
బెయిల్, రిమాండ్, పీటీ వారెంట్లు.. ఇలా వన్ బై వన్ వచ్చేస్తాయి. మిగిలిన కేసులో కూడా విచారణ కోసం పిటిషన్ వేస్తారు. అలా బాబు బయటకు వచ్చినా.. మళ్లీ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. దీనికి బ్రేక్ వేయటానికి హరీశ్ సాల్వేను రంగంలోకి దింపారు. ఆయన రాజ్యాంగ నిపుణుడు. అలాంటి వ్యక్తి చాలా కీలకమైన పాయింట్స్ మాట్లాడారు. ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. నాన్‌సెన్స్ కేసని కూడా అన్నారు. ఆయన అలా మాట్లాడారు అంటే.. సరైన పాయింట్ లేదా అన్న విమర్శ కూడా వచ్చింది. అందుకే ఆయన తన స్ట్రేచర్‌ను బేస్ చేసుకుని బాబును బయటకు తీసుకురావాలని చూస్తున్నారా?.. సాల్వే వాదించినా కానప్పుడు బాబును బయటకు తీసుకురావటం అంత సులభం కాదన్నదే ఇక్కడ కీలకం’’ అని అన్నారు.