iDreamPost
android-app
ios-app

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు!

  • Published Sep 01, 2023 | 12:44 PM Updated Updated Sep 01, 2023 | 12:44 PM
  • Published Sep 01, 2023 | 12:44 PMUpdated Sep 01, 2023 | 12:44 PM
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు!

చందమామపై పరిశోధనలు జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ – 3 ప్రయోగం అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో చంద్రయాన్ – 2 విఫలమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు పలు మార్పులు చేర్పులు చేసి చంద్రయాన్ – 3 జాబిల్లిపై పంపించారు. ఆగస్టు 23న జాబిల్లి దక్షణ ధ్రువంపై చంద్రయాన్ – 3 విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయ్యింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తల, పరిశోధకుల కృషికి యావత్ దేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఇస్రో నుంచి ఏ రాకెట్ ప్రయోగం చేసినా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. తాజాగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శుక్రవారం శ్రీ చెంగాళమ్మ ఆలోయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతి అప్ డేట్ ఇస్రో ప్రతిరోజూ అందిస్తుంది. తాజాగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యుడిపై ప్రయోగానికి సిద్దమవుతున్న ఆదిత్యా ఎల్ – 1 ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాక్షింక్షించారు. రేపు శనివారం ఉదయం 11.50 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.. కాగా దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది.

ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశిస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. చంద్రయాన్- 3 గొప్ప విజయం సాధించింది. చంద్రుడిపై ప్రయోగం మొదలు పెట్టాం.. ఇక సూర్యునిపై పరిశోధనల కోసం ఆదిత్యా-ఎల్ 1 ప్రయోగం చేయడానికి అన్ని రకాలుగా సిద్దమవుతున్నాం. చంద్రయాన్ -3 ద్వారా చంద్రుడి పై చేరిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఇక అక్టోబర్ లో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుంది. జీఎస్ ఎల్వీ మార్క్ – 2 ద్వారా ఇన్ శాట్ 3 డీఎస్ శాటిలైటన్ ని అంతరిక్షంలోకి ప్రంపేందుకు సిద్దమవుతున్నాం. నవంబర్ లో ఎస్ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం చేస్తాం అని ఇస్రో ఛైర్మన్‌ చెప్పారు.