ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జైలు గడప తొక్కని చంద్రబాబుకు.. ఏకంగా 14 రోజుల రిమాండ్ పడింది. శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే.. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతేకాక మంగళవారం ఆయన తరపు న్యాయవాదులు వేసిన హౌస్ అరెస్ట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక గంట కూడా జైలు లో గడపని చంద్రబాబు.. ఇప్పుడు రోజుల తరబడి జైలులో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రస్తుతం చంద్రబాబు స్థితిని చూసిన వారు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ పై ద్వేషము, జగన్ పై పగే.. చంద్రబాబు పతనానికి కారణమైందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో జరిగిన సంఘటనలు చూస్తే ఆ అభిప్రాయాలు కూడా నిజమేనని అనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలానే అంజయ్య మంత్రి వర్గంలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. అనంతరం వివిధ కారణాలతో చంద్రబాబు ఎన్టీఆర్ వైపు చేరారు. ఆ తరువాత ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 1995లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు… సీఎం సీటుతో పాటు పార్టీ పగ్గాలు తీసుకున్నారు. ఇలా సాగుతున్న చంద్రబాబు పాలనలో ఎందరో నేతలను కంట్రోల్లో పెట్టుకున్నాడు. సొంత పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను వివిధ రకాలుగా తన అదుపులో పెట్టుకోగలిగాడు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం.. చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి లొంగలేదు. తనదైన మాటలతో చంద్రబాబును వైఎస్ ఇరకాటంలో పెట్టారు. చంద్రబాబు చేసిన తప్పులను ప్రజల్లోకి రాజశేఖర్ రెడ్డి బలంగా తీసుకెళ్లారు. అంతేకాక ఏకంగా చంద్రబాబును అధికారానికి దూరం చేశాడు. అయితే వైఎస్ ఎప్పుడూ చంద్రబాబును రాజకీయంగా మాత్రమే ద్వేషించే వాడు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ ను వ్యక్తిగతంగా కూడా ద్వేషించే వాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అయినా చంద్రబాబు శాంతించలేదు.
ఆరోజుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, జగన్ కి మధ్య వైరం నడుస్తుంటే.. ప్రేక్షక పాత్ర వహించాల్సిన చంద్రబాబు.. అలా చేయలేదు. వైఎస్ పై ఉన్న కోపం.. ఆ కుటుంబాన్నే లేకుండా చేయాలనే చంద్రబాబు భావించారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ సమయంలో తన పార్టీ నేతల ద్వారానే జగన్ పై అక్రమాస్తుల పిటిషన్ వేయించి.. జగన్ జైలు వెళ్లడానికి కారణమయ్యడు. అంతేకాక అవినీతి పరుడు, సైకో అంటూ అనేక రకాల పేర్లతో జగన్ ని మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడు. అన్ని ఇబ్బందులు ధైర్యంగా ఎదుర్కొంటూ దాదాపు 10 ఏళ్ల తరువాత 2019 జగన్ సీఎం అయ్యాడు.
అయిన తరువాత కూడా జగన్.. పరిపాలనలో బిజీగా ఉంటే.. చంద్రబాబు మాత్రం ఊరుకోలేదని కొందరు అంటున్నారు. నాలుగేళ్లు సీఎంగా ఉండి.. తనను ఏం చేయలేకపోయాడని, సైకో అని, అవినీతి సీఎం, బాబాయిని చంపిన వ్యక్తి అంటూ తనలోని పగను చంద్రబాబు మాటల రూపంలో చూపించాడని కొందరు అంటున్నారు. ఇలా వైఎస్ పై ఉన్న ద్వేషం, జగన్ పై ఉన్న పగ కారణంగానే చంద్రబాబు సాధించినది ఏం ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ తండ్రీకొడులపై పెంచుకున్న ద్వేషమే నేడు చంద్రబాబు పతానికి కారణమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: TDP పగ్గాలు బాలయ్యకి? లోకేశ్‌ని సైడ్ చేసినట్టేనా?