iDreamPost
android-app
ios-app

అడిగి మరీ.. RTC బస్సులో ప్రయాణించిన టీమిండియా క్రికెటర్స్!

  • Published Feb 02, 2024 | 7:55 PM Updated Updated Feb 02, 2024 | 10:04 PM

India-England Players Traveled In APSRTC Bus: APSRTC బస్సులో టీమిండియా క్రికెటర్లతో పాటుగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకుంది సంస్థ.

India-England Players Traveled In APSRTC Bus: APSRTC బస్సులో టీమిండియా క్రికెటర్లతో పాటుగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకుంది సంస్థ.

అడిగి మరీ.. RTC బస్సులో ప్రయాణించిన టీమిండియా క్రికెటర్స్!

విశాఖపట్నం వేదికగా టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ భారీ శతకంతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ పుణ్యమాని టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఇక ఇదంతా కొద్దిసేపు పక్కనపెడితే.. ఓ ఆసక్తికర దృశ్యం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. APSRTC బస్సులో టీమిండియా క్రికెటర్లతో పాటుగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకుంది సంస్థ.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగే గ్రౌండ్ నుంచి ఆటగాళ్లు ఉండే హోటల్ కు కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఇందుకోసం అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు అన్న సంగతి మనకు తెలిసిందే. వారికి కేటాయించిన బస్సుల్లోనే క్రికెటర్లు గ్రౌండ్ కు హోటల్ కు ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆటగాళ్ల కోసం లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తారు. కానీ తాజాగా ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు APSRTC బస్సులో ప్రయాణం చేశారు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొలిరోజు ఆటముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.

అలాగే ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ. ఇక ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 179 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరి లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే క్రికెటర్లు ఏపీఎఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్‌ రికార్డ్‌ బ్రేక్‌! కొత్త చరిత్ర లిఖించిన జైస్వాల్‌