iDreamPost
android-app
ios-app

భర్త రెండో పెళ్ళిలో ఫస్ట్ భార్య ఎంట్రీ.. ట్విస్ట్ అదిరింది

  • Published Aug 09, 2024 | 2:46 PM Updated Updated Aug 09, 2024 | 2:46 PM

భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి కూతురితో కలిసి వివాహం జరుగుతున్న చోటుకు వెళ్లింది భార్య. అయితే భర్తకు ఈ విషయం తెలిసింది. అంతలో...

భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి కూతురితో కలిసి వివాహం జరుగుతున్న చోటుకు వెళ్లింది భార్య. అయితే భర్తకు ఈ విషయం తెలిసింది. అంతలో...

  • Published Aug 09, 2024 | 2:46 PMUpdated Aug 09, 2024 | 2:46 PM
భర్త రెండో పెళ్ళిలో ఫస్ట్ భార్య ఎంట్రీ.. ట్విస్ట్ అదిరింది

పట్టుమని పది రోజులు కూడా కలిసి కాపురం చేయడం లేదు కొత్త జంట. మూడు ముళ్ల ముచ్చట తీరకుండానే గొడవలు పడుతున్నారు.  ఈ మధ్యలోనే పిల్లలు కూడా పుడుతున్నారు. కానీ తగాదాలు సద్దుమణగడం లేదు.  దీంతో ఇద్దరికి పొసగక విడాకుల బాట పడుతున్నారు. వీళ్లు కలిసి సంసారం చేసిన దాని కన్నా..వివాదం సద్దుమణిగేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సమయమే ఎక్కువగా ఉంటుంది. అయితే కేసు కోర్టులో ఉండగానే మరో పెళ్లికి సిద్ధం అవుతున్నారు కొందరు. ఇప్పుడు ఇటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో చోటుచేసుకోగా.. భార్య ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివ్సర్ అయ్యింది. జరగాల్సిన పెళ్లి పెటాకులయ్యింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్యకు రాకేశ్ అనే యువకుడితో వివాహం అయ్యింది. పెళ్లైన కొద్ది రోజుల వరకు సంధ్య, రాకేశ్ సంసారం సాఫీగా సాగిపోయింది. వీరికో పాప పుట్టింది.  అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు డివోర్స్ కోసం కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉండగానే.. రాకేశ్ మరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం మొదటి భార్యకు సంధ్యకు తెలిసింది. కుటుంబ సభ్యులు, కూతురితో కలిసి భర్త వివాహం చేసుకుంటున్న మఠానికి చేరుకుంది. ఈ ట్విస్ట్ ఊహించలేదు భర్త. భార్య, బిడ్డ వస్తున్నారని తెలుసుకున్న వరుడు రాకేశ్ అక్కడ నుండి పరారయ్యాడు. కాగా, అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు సంధ్య ఆమె కుటుంబ సభ్యులు.

భర్త తనను మోసం చేసి, విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది సంధ్య. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది. కోర్టులో కేసు ఉండగానే మరో పెళ్లికి రెడీ అయ్యాడంటూ ఫిర్యాదు చేసింది.  ఆమెను మానసికంగా,  శారీరకంగా హింసించాడని ఆరోపిస్తున్నారు ఆమె తరఫు బంధువులు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  ప్రస్తుతం రాకేష్ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. సంధ్యకు విడాకులు ఇవ్వకుండా మరొకర్ని మనువాడబోతున్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio