విడయవాడకు రెడ్ అలర్ట్.. వచ్చే 24 గంటలు బయటకు రావొద్దు!

Red Alert For Viyawada- Stay Indoors: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

Red Alert For Viyawada- Stay Indoors: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. విజయవాడ, గుంటూరులో రహదారులు జలాశయాలను తలపిస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు అన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా వర్షపు నీరే దర్శనమిస్తోంది. జాతీయ రహదారి 16పై ఉన్న కాజా టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలో కొండచరియలు విరిగి పడి నలుగురు మృతి చెందారు. అయితే ఇంకా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయవాడకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

విజయవాడలో పరిస్థితులు చూస్తుంటే స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆగస్టు 31 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ముఖ్యంగా కృష్ణా, ఏలూరు జిల్లా అతి భారీ వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ జరిగింది. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ సమీపంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచనలో ఉన్నారు.

24 గంటలు బయటకు రావొద్దు:

విజయవాడ- గుంటూరు ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టే పరిస్థితి లేదు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు విజయవాడ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యిందని చెబుతున్నారు. పోలీసులు, అధికారులు కూడా రోడ్లపైకి రావొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాజా టోల్ ప్లాజా వద్ద ఒక ఎస్ఐ వీడియో బైట్ పోస్ట్ చేశారు. హైవేపై పరిస్థితి దారుణంగా ఉందని.. అనవసరంగా బయటకు రావొద్దు అంటూ హెచ్చరించారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాల వల్ల సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలని సూచిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు 0863 2234014, 9849904013.

Show comments