Tirupathi Rao
Gudla Valleru Colleage Students- Warden Audio Leak: గుడ్లవల్లేరు కాలేజ్ లో సీక్రెట్ కెమెరాలు అంటూ వచ్చిన వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ విషయానికి సంబంధించి స్టూడెంట్స్- హాస్టల్ వార్డెన్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి ఆడియో బయటకు వచ్చింది.
Gudla Valleru Colleage Students- Warden Audio Leak: గుడ్లవల్లేరు కాలేజ్ లో సీక్రెట్ కెమెరాలు అంటూ వచ్చిన వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ విషయానికి సంబంధించి స్టూడెంట్స్- హాస్టల్ వార్డెన్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి ఆడియో బయటకు వచ్చింది.
Tirupathi Rao
రెండు తెలుగు రాష్ట్రాల్లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు అంటూ ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. అమ్మాయిలు అంతా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి అని.. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం గురించి మూడ్రోజుల క్రితమే విద్యార్థినులకు తెలిసిందంట. శుక్రవారం తెల్లవారుజామున స్టూడెంట్స్ హాస్టల్ వార్డెన్ తో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒక బయటకు వచ్చింది. వార్డెన్ తో ఈ విషయం గురించి చర్చించిన సంఘటనను ఒకరు రికార్డ్ చేశారు. ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చింది.
స్టూడెంట్స్ లో కొందరు సీక్రెట్ కెమెరాలు, వీడియో రికార్డింగులకు సంబంధించి హాస్టల్ వార్డెన్ తో మాట్లాడారు. వార్డెన్ ని నిలదీసినంత పని చేశారు. అయితే ఇదంతా అసలు నిజమే కాదు అనే ధోరణిలో వార్డెన్ స్టూడెంట్స్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేయడం ఆడియోలో స్పష్టంగా వినచ్చు. అసలు స్టూడెంట్స్- వార్డెన్ డిస్కషన్ ఆడియోలో ఏం ఉందంటే.. ఎందుక అల్లరల్లరి చేస్తున్నారు? ఇద్దరో ముగ్గురో సైలెంట్ గా వచ్చి చెప్పుకోవాల్సిన విషయాన్ని ఎందుకు అల్లరి చేస్తున్నారు. మన మీద బురద జల్లుకోవడమే కదా. మేము సార్ దృష్టికి తీసుకెళ్లాం. అలాంటిది అసలు లేదు అన్నారు. రేపు సార్ వస్తారు కదా.. రేపు మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడతారు? ఇది అల్లరి చేసుకునే విషయమా? అసలు ఇది ఎందుకు స్ప్రెడ్ అయ్యింది? ఇది ఫేక్ అవ్వాలి.. ఫేక్ అవుతుంది. మీకు ఎవరు చెప్పారు? ఎవరికైనా ఎవరు చెప్పారు? రూమర్ కాబట్టే ఇంత త్వరగా స్ప్రెడ్ అవుతోంది. ఆడాళ్లం కదా అందుకే ఇలా అవుతుంది” అంటూ హాస్టల్ వార్డెన్ స్టూడెంట్స్ కి నచ్చచెప్పడం ఈ ఆడియోలో ఉంది.
ఈ ఆడియోలో విద్యార్థులు వార్డెన్ ని ప్రశ్నించడం కూడా ఉంది. సార్ దగ్గరకు వెళ్తే ఏం జరగదు అన్నట్లు స్టూడెంట్స్ కామెంట్స్ చేశారు. గతంలో కూడా ఫుడ్ విషయంలో సార్ దగ్గరకు వెళ్తే.. తమనోరే మూయించారు అంటూ స్టూడెంట్స్ ఆరోపించారు. అప్పటికి అప్పుడే సార్ హాస్టల్ కి రావాలి అంటూ స్టూడెంట్స్ పట్టుబట్టారు. అలాగే ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపేశారు అంటూ స్టూడెంట్స్ నిలదీశారు. తను తెల్లారే సరికి ఏదైనా చేయచ్చు. ఆధారాలు మొత్తం తారుమారు చేయచ్చు.
అసలు ప్రూఫ్స్ లేకుండా చేయచ్చు అని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ అమ్మాయి ఫోన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అప్పుడు వార్డెన్ సార్ కి కాల్ చేసి మాట్లాడగా.. ఆయన ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకోవడానికి ఆదేశించారు. స్విచ్ ఆఫ్ చేసి ఉంచాల్సిందిగా చెప్పారు. ఉదయం వచ్చిన తర్వాత మాట్లాడదం అని చెప్పారని వార్డెన్ కామెంట్స్ చేసింది. ఈ విషయం గురించి చర్చించే సమయానికి తమ దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వైరల్ ఆడియో చివర్లో అమ్మాయిలు.. వీళ్లు అంతా కవర్ చేస్తున్నారు. ఇవాళ రమ్మంటే రేపు వస్తారు అంట. అని కూడా వ్యాఖ్యలు చేయడం ఉంది.