iDreamPost
android-app
ios-app

అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఉత్తర్వులు జారీ..

Anganwadi Employees: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.

Anganwadi Employees: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.

అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఉత్తర్వులు జారీ..

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, సీఎం జగన్ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం శుభవార్తలు చెబుతోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పేదలకు అందే సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకున్నారు.  అలానే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన వారికి ఉపయోగపడే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా అంగన్ వాడీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా అంగన్ వాడీ హెల్పర్ల, వర్కర్ల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల క్రితం అంగన్వాడీలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో వారు కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. తాజాగా అంగీకరించిన రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో అంగన్వాడీ సహాయకులను వర్కర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వయో పరిమితి పెంపుతో పాటు మరో ఉత్తర్వు కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Jagan Sarkar good news for Anganwadis!

ఆంధ్రప్రదేశ్ లోని అంగన్ వాడీ హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని పెంచింది. ఆ ప్రకారం.. 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అంగన్వాడీలకు సంబంధించిన టీఏ, డీఏ లు చెల్లించేందుకు ఉద్దేశించిన మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఇటీవలే మంత్రులతో జరిపిన చర్చల్లో  ఇచ్చిన హామీ ప్రకారం.. ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అంగన్ వాడీల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వులు ఊరటగా చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులపై అంగన్ వాడీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెబుతుంటారు. నేడు అల్లూరి సీతామారాజు మన్యం జిల్లాలో సీఎం జగన్ పర్యటించి.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. ఇలా  అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడంతో పాటు.. అన్నా ఆదుకోరా… అంటూ వచ్చే వారికి సైతం అభయం ఇస్తుంటారు సీఎం జగన్. అందుకే ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. మరి..తాజాగా అంగన్వాడీల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.