iDreamPost
android-app
ios-app

మీకు రేషన్ కార్డు ఉందా?.. చదవడం, రాయడం రాకపోయినా మంచి జాబ్!

నేటికాలంలో నిరుద్యోగిత బాగా పెరిగి పోయింది. చదువుని జాబ్స్ దొరక్క కొందరు అయితే, చదువులేక మరికొందరు ఉపాధికి దూరమవుతున్నారు. అయితే  వివిధ సంస్థలు చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి..వారికి  ఉద్యోగ కల్పన సమకూరుస్తాయి. తాజాగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

నేటికాలంలో నిరుద్యోగిత బాగా పెరిగి పోయింది. చదువుని జాబ్స్ దొరక్క కొందరు అయితే, చదువులేక మరికొందరు ఉపాధికి దూరమవుతున్నారు. అయితే  వివిధ సంస్థలు చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి..వారికి  ఉద్యోగ కల్పన సమకూరుస్తాయి. తాజాగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

మీకు రేషన్ కార్డు ఉందా?.. చదవడం, రాయడం రాకపోయినా మంచి జాబ్!

నేటికాలంలో ఎక్కువ మంది జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.  ఈక్రమంలో కొందరు ఉద్యోగం సంపాదించింది… కుటుంబాన్ని పోషిస్తుంటారు. కొందరు మాత్రం తమకు చదవడం, రాయడం రాదని ఇక తమకు ఏం ఉద్యోగం వస్తుందని తెగ ఫీలవుతుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. రేషన్ కార్డు ఉండి…చదవడం, రాయడం రాకపోయిన ఉద్యోగం పొందొచ్చు. అంతేకాక కాస్తా కష్టపడితో మంచి ఆదాయం కూడా పొందొచ్చు. అయితే ఈ గుడ్ న్యూస్ ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నిరుద్యోగులకు మాత్రమే అని చెప్పాలి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో నిరుద్యోగిత బాగా పెరిగి పోయింది. చదువుని జాబ్స్ దొరక్క కొందరు అయితే, చదువులేక మరికొందరు ఉపాధికి దూరమవుతున్నారు. అయితే  వివిధ సంస్థలు చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి..వారికి  ఉద్యోగ కల్పన సమకూరుస్తాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు కూడా ఓ ప్రైవేటు బ్యాంకు శుభవార్త చెప్పింది.  10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం లభించింది. కర్నూలు జిల్లా కూల్లూరు కెనరా బ్యాంక్ వారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని గ్రామీణ యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంకు వాళ్లు తెలిపారు.

ఇక ఈ బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సెల్ ఫోన్ రిపేరిలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోనే నిరుద్యోగ యువతీ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, జాబ్స్ కల్పించే విధంగా కుట్టు మిషన్, మగ్గం వర్క్, కంప్యూటర్ డేటా ఎంట్రీలో శిక్షణను ఇస్తారు.  ఇక మొత్తం 30 నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్ సమయంల అభ్యర్థులకు తామే ఉచితంగా వసతి భోజన సదుపాయం కూడా కలిపిస్తామని కర్నూలు జిల్లా కలూరు శాఖకు చెందిన కెనరా బ్యాంక్ అధికారులు తెలిపారు. పై తెలిపిన వాటితో పాటు మగవారికి వివిధ రకాల ఆటోమొబైల్ వస్తువుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొబైల్ రిపేర్, బైక్ మెకానిక్, సీసీ కెమెరా ఇంస్టాలేషన్ వంటి ఉపాధి కోర్సుల్లో కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నట్లు కర్నూలు కెనరా బ్యాంక్ కల్లూరు బ్రాంచ్ మేనేజర్ బి. శివప్రసాద్ తెలిపారు.

మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు సెల్ ఫోన్ రిపేరిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు వయసు 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. ఈ ట్రైనింగ్ తీసుకోవాలని అనుకునే వారు ఎలాంటి విద్యార్హత లేకపోయినా అర్హులే అని తెలిపారు. చదవడం, రాయడం వస్తే మేలు, అలా కాకపోయినా శిక్షణ తీసుకుని మంచి జాబ్ పొందవచ్చుని పలువురు చెబుతున్నారు. ఆసక్తి తమ పూర్తి బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లు, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని కల్లూరులో ఉన్న కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి సంస్థ ఆఫీస్ ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 90007 10508 నెంబర్ను కాల్ చేయచ్చు. గతంలో చిత్తూరు జిల్లాలో కూడా ఓ బ్యాంకు వేసవి సందర్భంగా ఇలాంటి అవకాశాన్నే కల్పించింది.