iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: మాజీ మంత్రి, TDP నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌

  • Published Sep 01, 2023 | 11:53 AM Updated Updated Sep 01, 2023 | 11:53 AM
  • Published Sep 01, 2023 | 11:53 AMUpdated Sep 01, 2023 | 11:53 AM
బ్రేకింగ్‌: మాజీ మంత్రి, TDP నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కృష్ణాజిల్లా పోలీసులు అయ్యన్నపాత్రుడుని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం యువగళం పాదయాత్రలో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ మంత్రులను దూషించారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయనను కృష్టా జిల్లాకు తరలించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు శుక్రవారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. యువగళం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశారంటూ.. మాజీ మంత్రి పేర్ని నాని.. అ‍య్యన్న పాత్రుడు, బుద్ధా వెంకన్నల మీద ఆత్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్న పాత్రుడు, బుద్ధా వెంకన్నల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు పోలీసులు అయ్యన్నను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం యువగళం సభలో అయ్యన్న పాత్రుడు మంత్రి రోజా గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజాని ఉద్దేశించి మేకప్‌ రాణి అని.. సీఎం జగన్‌ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో పేర్ని నాని అయ్యన్న పాత్రుడు మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నేడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio