Elections 2024: ఓటు వేయబోతున్నారా.. ఇలా చేస్తే జైలుకే.. జాగ్రత్తగా ఉండండి

మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని.. లేదంటే జైలుకే అంటున్నారు అధికారులు.

మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటు వేయడానికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని.. లేదంటే జైలుకే అంటున్నారు అధికారులు.

ఐదేళ్ల పాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అతి శక్తివంతమైన అస్త్రం ఓటును ఉపయోగించుకునేందుకు సమయం దగ్గర పడుతుంది. మే 13, సోమవారం నాడు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దాంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఫుల్లు రద్దీ కనిపిస్తోంది. ఇక పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి.. గంటల కొద్ది ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇక ఓటు వేయడానికి వెళ్లే వారికి కీలక అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. ఓటు వేసే సమయంలో మీరు గనక ఇలాంటి పనులు చేస్తే.. జైలుకే వెళ్తారు అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో మే 13, సోమవారం నాడు పోలింగ్‌ జరగనుంది. నేటి నుంచి హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అలానే ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు.

పోలింగ్‌ బూత్‌ వద్ద..

  • పోలింగ్‌ బూత్‌ సమీపంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.
  • పోలింగ్‌ బూత్‌ సమీపంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు.. గొడవలు సృష్టించకూడదు.
  • పోలింగ్‌ బూతులోకి మొబైల్‌, కెమరా వంటివి తీసుకెళ్లకూడదు.
  • పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించకూడదు.
  • మద్యం తాగి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకూడదు.
  • ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి.
  • ఇతరుల ఓటు మీరు వేయడానికి ప్రయత్నించకూడదు.
  • అలా చేస్తే కఠిన శిక్ష తప్పదు అంటున్నారు అధికారులు.

ఓటరు ఇలా చేస్తే నేరం..

  • ఓటు వేయడానికి పోలింగ్‌ బూతులోకి వెళ్లినప్పుడు మొబైల్‌ తీసుకెళ్లకూడదు.
  • మర్చిపోయి సెల్‌ఫోన్‌ తీసుకుని.. పోలింగ్‌ బూత్‌ వరకు వెళ్లినా.. దాన్ని స్విచ్ఛాఫ్‌ చేసి అధికారులకు ఇవ్వాలి.
  • ఓటు వేసేటప్పుడు ఫోటోలు దిగడం చేయకూడదు.
  • అలానే ఏ పార్టీకి ఓటు వేశారని వెల్లడించడం కూడా నేరమే అవుతుంది.
  • మీరు ఓటు వేసేటప్పుడు ఎవరైనా ఫొటో, వీడియో తీస్తే.. పోలీసులకు చెప్పాలి.
  • ఓటరు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వెంటనే పోలింగ్ బూత్‌ను వదిలి బయటకు వచ్చేయాలి.
  • ఉద్దేశపూర్వకంగా ఎక్కువ సేపు అక్కడే నిల్చుని.. ఇతరులు ఓటు వేయకుండా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటారు.
  • ఓటుకు నోటు తీసుకోవడం నేరం.
  • ఎవరైనా డబ్బులు తీసుకుని ఓటు వేశారని రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటారు.

దొంగ ఓటు వేస్తే..

  • ఓటరు లిస్ట్‌లో ఎవరి పేరుందో ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి.
  • ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తి బదులు వేరు వ్యక్తి ఓటు వేస్తే అతడిపై కేసు నమోదు చేస్తారు.
  • దొంగ ఓట్లు వేయడం చట్టరీత్యా నేరం.
  • అలాగే ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు.
  • ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలి.
  • ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ.. కేవలం ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకోవాలి.
  • రెండూ చోట్ల ఓటు వేస్తే ఆవ్యక్తిపై చర్యలు తీసుకుంటారు.
  • పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి.
Show comments