iDreamPost
android-app
ios-app

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లే ఖంగుతిన్నారు!

ఆమెకు ఈ మధ్య కాలంలో విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. అయితే నొప్పి తగ్గడానికి ఏవేవో మాత్రలు వేసుకునేది. నొప్పి తగ్గకపోగా పెరిగింది. ఇక తప్పదని ఆసుపత్రికి వెళ్లింది. తీరా పరీక్షలు చేయగా..

ఆమెకు ఈ మధ్య కాలంలో విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. అయితే నొప్పి తగ్గడానికి ఏవేవో మాత్రలు వేసుకునేది. నొప్పి తగ్గకపోగా పెరిగింది. ఇక తప్పదని ఆసుపత్రికి వెళ్లింది. తీరా పరీక్షలు చేయగా..

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లే ఖంగుతిన్నారు!

ఓ మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. తగ్గిపోతుందిలే అని కాస్త నిర్లక్ష్యం వహించింది. నొప్పి తగ్గేందుకు బఠాణీల్లా ట్యాబ్లెట్స్ మింగేసేది. అప్పటి వరకు కాస్త ఉపశమనం. మళ్లీ కథ మొదటికే. ఆ నొప్పి మరింత ఎక్కువ కావడంతో చూపించుకుందామని ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వాటిల్లో ఏమీ తేలలేదు. చివరకు అనుమానంతో స్కాన్ చేయగా.. అవాక్కవ్వడం వైద్యుల వంతైంది. నాలుగు రాళ్లు వెనకేసుకోమన్నారని.. ఆ మహిళ కడుపులో వేసుకుంది. నాలుగు రాళ్లో, 40 రాళ్లో, నాలుగు వందల రాళ్లో కాదు.. అంతకు మించిన స్ట్రోన్లను బంగారంలా దాచుకుంది ఆమె పొట్టలో. చివరకు వైద్యులు శ్రమించి..మొత్తం రాళ్లను బయటకు తీశారు.

ఏకంగా 570 రాళ్లను బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేదర్క్ కోనసిమా జిల్లాలోని అల్లవరం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవ గుప్తంకు చెందిన నరస వేణి అనే మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రికి వెళ్లకుండా..పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండేది. అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చేవి. అయితే ఇటీవల కాలంలో నొప్పి తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఆ నొప్పిని భరించలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాలని అనుకుంది. చివరకు అమలాపురంలోని ఏఎస్ఎ ఆసుపత్రికి వెళ్లింది. తొలుత పరీక్షలు నిర్వహించగా.. అంతా బాగానే ఉందన్నారు.

A woman was admitted to the hospital with abdominal pain

కానీ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. స్కానింగ్ లో కూడా ఇదే తేలింది. వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. ఆమె కడుపులో నుండి స్టోన్స్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు. ఒక్కొక్కటిగా రాయిని తీశారు. అలా ఆమె కడుపులో నుండి 570 రాళ్లను బయటకు తీశారు. కాగా, కడుపులో ఇన్ని రాళ్లు ఉండటం చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మహా అయితే పదుల సంఖ్యలో రాళ్లు ఉంటాయని, ఆమె ఒంట్లో వందల కొద్దీ రాళ్లు ఉండటం చాలా అరుదైన విషయం అని తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు వైద్యులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి