iDreamPost
android-app
ios-app

పించన్లు తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇక ఏ టెన్షన్ లేదు

  • Published Dec 06, 2023 | 10:23 AM Updated Updated Dec 06, 2023 | 10:23 AM

ఆంధ్రప్రదేశ్ లో నెల ప్రారంభం 1-5 తేదీల వరకు పెన్షన్లు అందజేస్తారు. డిసెంబర్ నెల పించన్లకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ లో నెల ప్రారంభం 1-5 తేదీల వరకు పెన్షన్లు అందజేస్తారు. డిసెంబర్ నెల పించన్లకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 06, 2023 | 10:23 AMUpdated Dec 06, 2023 | 10:23 AM
పించన్లు తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇక ఏ టెన్షన్ లేదు

పించన్లు తీసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అదనంగా ఒక రోజు పొడిగించింది గవర్నమెంట్. సాధారణంగా ఏపీలో ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే పింఛన్ల పంపిణీని.. ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం మిచౌంగ్ తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. అధికారులు, వాలంటీర్లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ కారణంగా ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల పించన్లకు సంబంధించి ప్రభుత్వం 65,33,781 మంది లబ్ధిదారుల కోసం రూ.1,800.96 కోట్లను విడుదల చేయగా.. ఐదో తేదీ సాయంత్రానికే 64,62,991 మంది లబ్ధిదారులకు రూ.1,781.37 కోట్ల మేర పించన్ల పంపిణీ పూర్తయ్యింది. ఓవైపు మిచౌంగ్ తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మంగళవారం కూడా 81,702 మందికి పైగా లబ్ధిదారులకు వలంటీర్లు పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఇవాళ పంపిణీ చేయనున్నారు. పింఛన్లు అందని వారు టెన్షన్ పడొద్దని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

తుపాను నేపథ్యంలో బాధితులకు రేషన్‌ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం జగన్. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామన్నారు.

తుపాను బాధితులకు సహాయం అందించడంలో, సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. నెల్లూరు, తిరుపతి సహా తుపాను కారణంగా దెబ్బతిన్న అన్ని ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.

ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వెంటనే ఎన్యూమరేషన్‌ కూడా ప్రారంభం కావాలన్నారు. అలానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అధికారులు భరోసా ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom