iDreamPost
android-app
ios-app

వీడియో: సీఎం జగన్ కి రాఖీ కట్టిన కలెక్టర్ మాధవిలత!

వీడియో: సీఎం జగన్ కి రాఖీ కట్టిన కలెక్టర్ మాధవిలత!

అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతిరూపంగా జరిగే పండుగ రాఖీ. అయితే అందుకే ప్రతి సోదరి.. తన సోదరుడికి, తన సోదరుడిలా భావించే వ్యక్తులకు రాఖీ కడుతుంది. అంతేకాక  రాఖీ కట్టినందుకు తమ సోదరిమణులకు వివిధ రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఈ పండగ సందర్భంగా ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీలు కట్టారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కలెక్టర్ మాధవిలత రాఖీ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్  రెడ్డికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత రాఖీ కట్టారు. ఆమె గతంలో కృష్ణా జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా  విధులు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కి ఆమె రాఖీ కట్టారు. అలానే సీఎం జగన్ నుంచి కలెక్టర్ ఆశీర్వదం తీసుకున్నారు. సీఎం కూడా ఆమెకు రాఖీ శుభాకాంక్షలు తెలిపి.. ఆశీస్సులు అందించారు.

ఇలానే పలువురు మహిళా అధికారులు, ఇతర మహిళా నేతలు కూడా సీఎం జగన్ కి హెలిప్యాడ్  వద్దకు వెళ్లి.. సీఎం జగన్ కి రాఖీ కట్టారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికి సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తునందుకు అక్కచెల్లమ్మలందరికి కృతజ్ఞుడై ఉంటాని ఆయన తెలిపారు. ప్రస్తుతం కలెక్టర్ మాధవిలత సీఎంకి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş