iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రజలకు CM జగన్ ఉగాది శుభాకాంక్షలు

  • Published Apr 08, 2024 | 7:02 PM Updated Updated Apr 08, 2024 | 7:02 PM

CM Jagan Ugadi Wishes: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.

CM Jagan Ugadi Wishes: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.

  • Published Apr 08, 2024 | 7:02 PMUpdated Apr 08, 2024 | 7:02 PM
రాష్ట్ర ప్రజలకు CM జగన్ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారికి ఉగాది ఎంతో ప్రత్యేకం. ఆంగ్ల సంవత్సరం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నా కూడా తెలుగు వారికి మాత్రం ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇలాంటి ప్రత్యేక పర్వదినం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

శ్రీ క్రోధి నామ వత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఈ శ్రీ క్రోధి నామ వత్సరంలో అన్నీ శుభాలు, సంతోషాలు కలగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్నీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని ఆకాంక్షించారు. మన సాంప్రదాయం, మన సంస్కృతి ఇలాగే వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ క్రోది నామ సంవత్సరం వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet