Arjun Suravaram
గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ 8వ తరగతి విద్యార్థులక ట్యాబ్ లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ 8వ తరగతి విద్యార్థులక ట్యాబ్ లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకోని అనేక సంచలన నిర్ణయాలు సీఎం జగన్ తీసుకున్నారు. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి.. ఆ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. నాడు-నేడు కింద ప్రభుత్వ బడుల రూపు రేఖాలు మార్చారు. కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులను తయారు చేశారు. అలానే పేద విద్యార్థులు చదువుకునే విషయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా.. వారి కోసమే పలు పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే విడతల వారిగా విద్యార్థుల తల్లు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. అలానే విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేసి.. వారికి మేనమామగా సీఎం జగన్ తోడు ఉంటున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో ఏడాది కూడా ఆ విద్యార్థులకు ట్యాబ్స్ ను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై సత్తా చాలాన్న లక్ష్యంతో సీఎం జగన్ రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కెంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ ను 9,424 పాఠశాల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ఈ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థఉల చేతుల్లోనే ఉందని సీఎం జగన్ తెలిపారు. అడవి తల్లి బిడ్డల మధ్యలో ఈ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను 10 రోజుల పాటు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతీ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం తెలిపారు. 55 నెలలుగా ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశాగానే పడిందని, పిల్లలకు అసరమైన బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ లు అందిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులకు పంపిణీ ట్యాబ్ ల పంపిణఈ చరిత్రలోనే నిలిచిపోతుందని జగన్ తెలిపారు. ట్యాబ్ లల్లో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయని, తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ఇక ట్యాబ్ లో సమస్య తలెత్తితే ప్రభుత్వమే రిపేర్ చేస్తుందని, రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ క్లాస్ రూమ్ ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దామని, ఇక తాము అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ లో రూ.17,500 ఉంటుందని, అలానే రూ. 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఉచితంగా ఇస్తున్నామని సీఎం తెలిపారు. వీటి పంపిణీ ద్వారా ప్రతీ విద్యార్థికీ రూ.33 వేల లబ్ధి చేరుకుందని సీఎం తెలిపారు. ప్రతీ తరగతి గదిని డిజిటలైజ్ చేస్తున్నామని, ట్యాబ్ తో పిల్లలకు చదువు సులభతరమవుతుందని సీఎం తెలిపారు. మన పిల్లలు ప్రపంచంలో దిబెస్ట్ గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని సీఎం జగన్ తెలిపారు. మరి.. సీఎం జగన్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.