iDreamPost
android-app
ios-app

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ట్వీట్‌కు సీఎం జగన్ రియాక్షన్!

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ట్వీట్‌కు సీఎం జగన్ రియాక్షన్!

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) డిప్యూటీ మేనిజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ట్వీట్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఆమెకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవలే ఏపీ నుంచి కొందరు విద్యార్థులు అమెరికా, ఐరాస పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఐఎంఏఫ్ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సందడి చేశారు. అంతేకాక అక్కడ ఏపీ విద్యార్థులు.. తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా ఐఎంఎప్ కార్యాలయంలో సందడి చేసి..  ఈ సంస్థ డిప్యూటీ మేనిజింగ్  డైరెక్టర్ గీత గోపీనాథ్ తో ముచ్చటించారు. ఆమె ఆహ్వానం మేరకే ఏపీ విద్యార్థులు అక్కడి వెళ్లన సంగతి మనందరికి తెలిసిందే.

ఇక ఐఎంఎఫ్ కార్యాలయంలో ఏపీ విద్యార్థులు సందడి చేసిన ఫోటోలను, గీతా గోపినాథ్ పిల్లలతో  ఉన్న  ఫోటోను తన ఎక్స్  అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. అమెరికా, ఐరాస పర్యటనలో భాగంగా.. వాళ్లను ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నట్లు గీతా గోపీనాథ్ పోస్ట్ చేశారు. అంతేకా విద్యార్థులను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె ట్వీట్ లో తెలియజేశారు. ఇక ఆమె ట్వీట్ కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.  తమ విద్యార్థులను ఆహ్వానించి  ముచ్చటించినందుకు గానూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ఆమెకు  ధన్యవాదాలు తెలిపారు.

” మా పిల్లలను కలసినందుకు, సాదరంగా ఆహ్వానించినందుకు గీతా గోపీనాథ్ గారికి కృతజ్ఞతలు. మా పిల్లల చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయి”  అంటూ ఆమె ట్వీట్ కు జగన్ స్పందించారు. చదువు అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను నిజంగా నమ్ముతున్నానని సీఎం జగన్ తెలిపారు. అందుకు తమ పిల్లలే నిదర్శనమని, అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను చూసినప్పుడు తాను గర్వంగా ఫీలయ్యానని సీఎం జగన్ పోస్ట్ చేశారు. మరి.. సీఎం జగన్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss