YS Jagan: నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: CM జగన్

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో యాత్రలో ప్రజల్లోకి వెళ్లారు. మేమంత సిద్ధం పేరుతో బస్సుయాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో యాత్రలో ప్రజల్లోకి వెళ్లారు. మేమంత సిద్ధం పేరుతో బస్సుయాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రాజకీయ రణరంగం  ప్రారంభమైంది. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ఓ విడత  ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేమంతా సిద్ధం పేరుతో మరో యాత్రకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సీఎం జగన్ సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఈ రోజు  ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళ్లర్పించి..యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సాగిన బస్సుయాత్ర ప్రొద్దుటూరికి చేరుకుంది. సాయంత్ర ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డాడరు. కుట్రలు, మోసాలు, చేయడంలో చంద్రబాబుకి 45ఏళ్ల అనుభవం ఉందన్నారు. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపారని, ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈజిల్లా ప్రజలకు తెలుసని సీఎం అన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు తన వాళ్లు భాగం అయ్యారని సీఎం అన్నారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..” ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు, ఆయన టీమ్ నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు, మోసాలకు పాల్పడే వాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు.  అలాంటి దృష్టులంతా కలిసి జగన్ పై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ లు  జగన్ పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. వీళ్లు సరిపోరన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొచ్చి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి” అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మరి.. సీఎం జగన్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments