CM Jagan: నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: ఉరవకొండ సభలో జగన్‌

జగన్‌ ప్రభుత్వం నేడు ఎస్సార్ ఆసరా పథకం కింద నాల్గవ విడత నిధులను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. ఈ సందర్భంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన మార్పుల గురించి ఉద్దేశించి ప్రస్తావించారు .

జగన్‌ ప్రభుత్వం నేడు ఎస్సార్ ఆసరా పథకం కింద నాల్గవ విడత నిధులను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. ఈ సందర్భంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన మార్పుల గురించి ఉద్దేశించి ప్రస్తావించారు .

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జగన్‌ ప్రభుత్వం నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో భాగంగా ఈ నిధులు విడుదల చేశారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం.. డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను తనే చెల్లిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు విడతల్లో.. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు చెల్లించగా.. నేడు నాల్గవ విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు అనగా జనవరి 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకం నిధుల్ని విడుదల చేశారు. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. ఇక మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని.. నేడు 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేశారు. చివరి నాలుగవ విడత నిధులను మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది.

ఈ సందర్భంలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఇలా వ్యాఖ్యానించారు. “దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంతా తేడా కేవలం ఏపీలో మాత్రమే కనిపిస్తోంది. మహిళా సాధికారతకు ఏపీలో పెద్ద పీట వేస్తున్నాం. మహిళలు బావుంటేనే రాష్ట్రము ముందడుగులో ఉంటుంది. డ్వాక్రా మహిళలు ఖాతాల్లో ఇప్పటికే కొన్ని కోట్లు జమచేసి.. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. గతంలో అంతా లంచాల మయం. ఇప్పుడు కుల, మతం, ప్రాంతం , వర్గం , కనీసం ఏ పార్టీ అని చూడకుండా ఓటు వేయనున్న పర్వాలేదు.. అర్హత ఉన్న వారికీ ప్రామాణికంగా లబ్ది చేస్తున్నాం. ఇప్పటికే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ. 4,968 కోట్లు చెల్లించాం. ఆసరా సున్నా వడ్డీ కింద రూ. 31వేల కోట్లు అందించాం. గత 56 నెలలలో రాష్ట్రంలోని అక్కచెల్లమ్మలకు రూ. 2.53 లక్షల కోట్లు అందించాము. ఇలా జగనన్న అమ్మఒడి కింద రూ. 26,067 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద రూ. 25,571 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ. 4,129 కోట్లు అందించాం. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు. గత 56 నెలలలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఎంతో సంతోషంగా ఉంది.” అంటూ వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా “గత ప్రభుత్వంలో అంతా దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. చంద్రబాబుకు ఇతర పార్టీలలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ, నాకు ప్రజలే క్యాంపెయినర్లు. గతంలో ఎందుకు అక్కచెల్లమ్మలకు మంచి జరగలేదు? అక్క చెల్లెమ్మల కుటుంబాలను పట్టించుకునే స్థితిని మనం చూశామా!” అంటూ జగన్ ప్రశ్నించారు . అలాగే “మన ప్రభుత్వంలో ఇప్పటివరకు 31లక్షల అక్క చెల్లెమ్మలు ఇళ్ల పట్టాలు ఇచ్చాము. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి ఇల్లు పూర్తి అయితే.. సుమారు రూ.5 లక్షల ఆస్తి వారి చేతిలో ఉన్నట్లే. డ్వాక్రా సంఘాల పేరుతో చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు మోసాలతో సంఘాల గ్రేడ్లు పడిపోయాయి. కానీ, అక్కచెల్లమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. ” అంటూ సీఎం జగన్ ప్రస్తావించారు.

Show comments