iDreamPost
android-app
ios-app

కోవిడ్ కొత్తవేరియట్ పై సమీక్ష.. CM జగన్ కీలక ఆదేశాలు!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై తరచూ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటారు. తాజాగా కొత్త వేరియంట్ అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై తరచూ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటారు. తాజాగా కొత్త వేరియంట్ అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కోవిడ్ కొత్తవేరియట్ పై సమీక్ష.. CM జగన్ కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. వైద్య రంగంలో అనే సంస్కరణలు తీసుకొచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అలానే విపత్కరమైన పరిస్థితుల్లో కూడా జగన్ ప్రభుత్వం ఎంతో జాగ్రత్తలు తీసుకుంది. మూడేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కోవిడ్ కొత్తవేరియడ్ జేఎన్-1 విస్తరిస్తున్నట్లు సమచారం. ఈ కొత్తవేరియట్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశంపై నిర్వహించారు. అంతేకాక అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తుందని టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో తాడేపల్లిలో  క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు, ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు.  డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు.. జేఎన్-1 మాత్రం వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

A review on the new variant of Covid2

అంతేకాక పాజిటీవ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్ లో పరిశీలిస్తున్నామని, ఇవి కొత్త వేరియంట్లను గుర్తించడానికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామని అధికారులు సీఎం జగన్ కి తెలిపారు. ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ ఫ్రాను సిద్ధం చేస్తున్నాం పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకున్నామని, అలాగే ఆక్సిజన్ కాన్స్ ట్రేటర్లు,డి-టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. అలానే 56 వేల 741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు.

ఇక ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేయియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెబుతున్నారని, ముందస్తు చర్యల పట్టల దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్డ్ చేయాలని తెలిపారు. కొత్త వేరియట్ లక్షణాలు , తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet