iDreamPost
android-app
ios-app

రెవెన్యూ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలి: CM జగన్‌

రెవెన్యూ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలి: CM జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూముల సమస్యలు, ఇతర అంశాలకు సంబంధించి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష  అనే కార్యక్రామాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భూములకు సంబంధించిన రికార్డులను, ఇతర సమస్యలను పరిష్కరంచే పనిలో రెవెన్యూ అధికారులు బిజీగా  ఉన్నారు. అలానే తరచూ సీఎం కూడా భూహక్కు-భూరక్షపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటారు. తాజాగా గురువారం కూడా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్షపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్.. అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలని ఆయన తెలిపారు. అంతేకాక సమగ్ర భూసర్వే వలన జరుగుతున్న ప్రయోజనాల సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలని సీఎం సూచించారు. ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక… వక్రీకరిస్తోందని ఆయన అన్నారు. ఇలా వక్రీకరించి  చేస్తోన్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.

ఇంకా సీఎం మాట్లాడుతూ…”చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలుకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా సర్వేయరు ఉన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వా కోసం ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతోంది. త్వరలో రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాము. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.  అలానే ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు ఇంటి నుంచే  చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం. అలాగే భూ వివాదాలను సంబంధించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్‌ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు.  మరి.. సీఎం జగన్ చేసిన కీలక సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş