YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో పాల్గొన్న CM జగన్!

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముగింపు వేడుకలు వైజాగ్ వేదికగా ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముగింపు వేడుకలు వైజాగ్ వేదికగా ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ‘ఆడుదాం’ ఆంధ్రా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. ఇప్పటికే వివిధ దశలో విజయం సాధించిన వారికి ఈనెల9న నుంచి 13 వరకు ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. నేడు ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు వైజాగ్ లో జరిగాయి. ఈ వేడుకు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వేదికపై నుంచి సీఎం జగన్ మ్యాచ్ లను తిలకించారు.

క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. యువతలోని  క్రీడా నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే ఆశయంగా ఈ కార్యక్రమాని చేపట్టారు. 50 రోజుల పాటు సంబరంలా ఈ పోటీలు సాగాయి. విశాఖ వేదికగా అట్టహాసంగా ముగింపు వేడుకలు జరిగాయి. ఇక ఈప్రోగ్రామ్ ద్వారా ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ క్రీడల్లో మొత్తం 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక వేడుకలో భాగంగా విశాఖ ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను సీఎం జగన్ వీక్షించారు. వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించారు. అలానే సీఎం జగన్ చప్పట్లు కొడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఇక ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ తిలకించారు. వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇక ఈ వేడుకలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆడుదాం ఆంధ్రా టీషర్ట్స్ తో  డ్యాన్సులు చేస్తూ  అలరించారు. ఈ వేడుకలను సీఎం జగన్ వేదికపై నుంచి తిలకించారు. ఈ సభలో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు. ఈ వేడుకలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, విడదల రజనీ, బొత్స సతీమణి ఝాన్సీ, వైవీ సుబ్బారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన లైట్ షో అందరిని ఆకట్టుకుంది.

Show comments