iDreamPost
android-app
ios-app

చిన్నారికి తండ్రి పేరు పెట్టిన CM జగన్‌.. తండ్రి అంటే ఇంత ఇష్టమా..!

  • Published Dec 30, 2023 | 6:24 PM Updated Updated Dec 30, 2023 | 6:24 PM

YS Jagan: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్, ఓ చిన్నారికి నామకరణం చేశారు. ఆ చిన్నారికి జగన్ పెట్టిన పేరు చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

YS Jagan: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్, ఓ చిన్నారికి నామకరణం చేశారు. ఆ చిన్నారికి జగన్ పెట్టిన పేరు చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

  • Published Dec 30, 2023 | 6:24 PMUpdated Dec 30, 2023 | 6:24 PM
చిన్నారికి  తండ్రి పేరు పెట్టిన CM జగన్‌.. తండ్రి అంటే ఇంత ఇష్టమా..!

తరచూ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల  అడిగి తెలుసుకుంటారు. అలా అభిమానించే నాయకులు దగ్గరకు అప్పుడప్పుడు చంటి పిల్లలను ఎత్తుకుని వస్తూ ఉంటారు. అంతేకాక  తమ పిల్లలకు మీరే పేరుపెట్టండి అంటూ  తమ అభిమాన నేతను అడుగుతుంటారు. అలాంటి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో జరిగాయి. ఆయన  వివిధ  సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. గతంలో చిన్నారికి దేవుడు అని  జగన్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి ఏకంగా తన తండ్రి  రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టారు. దీంతో సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..  ఏ హోదాలో ఉన్న ప్రజల్లోకి అందుబాటులోనే ఉంటారు. అంతేకాక సమస్యలతో తన దగ్గరి వచ్చే ప్రజలకు మంచి మనస్సుతో ఆదుకుంటారు. అంతేకాక అవ్వ, తాత, చిన్నారులు, ఇలా అందరితో సీఎం జగన్ కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పర్యటనలో అరుదైన ఘటనలు, అపూర్వమైన ఘటనలో కొన్ని చోటుచేసుకుంటాయి. తాజాగా సీఎం జగన్ భీమవరంలోని దువ్వూరు మండలం జిల్లెల గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా చిట్టూరి సోనీ, మోహన్ కుమార్ తమ ఐదు నెలల బిడ్డను తీసుకుని సీఎం జగన్ వద్దకు వచ్చారు.

మోహన్ దంపతులు బిడ్డకు పేరు పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఆ దంపతులతో కాసేపకు ముచ్చటించిన సీఎం జగన్ వారి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. అంతేకాక తానే స్వయంగా ఆ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు.  ఏం పేరు పెడదాం అంటూ.. ఆ చిన్నారి తల్లిదండ్రులను అడిగాడు.  “నాన్న పేరు పెడదాం” అంటూ ‘రాజశేఖర్’ అని ఆ చిన్నారికి నామకరణం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా  తెగ వైరల్ అయ్యింది.

సీఎం జగన్ చిన్నారిని ఎత్తుకుని ఆడించిన తీరు అందరని ఆకట్టుకుంది. ఈయన కదా ప్రజల నాయకుడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిన్నారికి తన తండ్రి పేరు పెట్టి మరోసారి తన నాన్నపై తనకు ఉన్న ప్రేమను సీఎం జగన్ చాటుకున్నారు. గతంలోనూ ఓ సారి  సీఎం జగన్ ఓ చిన్నారికి దేవుడు అని పేరు పెట్టాడు.  ఇలా తరచూ పిల్లలతో సీఎం జగన్ సందడి చేస్తుంటారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom