Arjun Suravaram
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. వివిధ రకాల అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాక ఓ వృద్ధురాలిని పలకరించిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు.
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. వివిధ రకాల అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాక ఓ వృద్ధురాలిని పలకరించిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా.. అంటూ సాయం కోసం వచ్చిన వారికి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పిస్తారు సీఎం జగన్. అంతేకాక ప్రతి పేద గుండె చప్పుడును అర్థం చేసుకునే అసలైన జననేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. సమస్య ఏదైనా సరే.. కష్టం అంటూ తన వద్దకు వచ్చిన వారికి ధైర్యం కల్పిస్తుంటారు. ఇప్పటికి వివిధ రకాల సమస్యలతో సాయం కోరి వచ్చిన వారిని సీఎం జగన్ ఆదుకున్నారు. తాజాగా మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా శ్రీసత్య సాయి జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాక ఇది కదా జగనన్న అంటే.. అనే కామెంట్స్ సైతం వినిపిస్తోన్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఐదో రోజు బస్సుయాత్ర శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఇక సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సుయాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. ఆయనకు అడుగడుగున్న జన నీరాజనం చూసి.. ప్రత్యర్థులకు చెమటలు పడుతున్నాయి. సోమవారం బత్తులపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో అడుగడుగున జనసందోహం కనిపించింది. ఐదో బస్సుయాత్రలో దారిపోడవునా గజమాలతో సీఎం జగన్ కి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ ను చూసేందుకు జనం బారు తీరారు. ఇదే సమయంలో ముదిగుబ్బ ప్రాంతం వద్ద కొందరు సీఎం జగన్ ను కలిశారు. వారిలో ఓ వృద్ధురాలు కూడా ఉన్నారు. ఆమె ఓ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు.
ఆమెకు ముఖంతో సహా ఒళ్లంతో బొబ్బలు, కురుపులు ఉన్నాయి. తన సమస్యను చెప్పుకునేందుకు ఆ వృద్ధురాలు సీఎం జగన్ దగ్గరకి వెళ్లింది. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ అవ్వచేతులను తన చేతులతో పట్టుకుని ఆమెతో ఆప్యాయంగా పలకరించారు. ఆమె చెప్పే మాటలను ఎంతో ఓపికగా ఉన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆ పెద్దావిడకు భరోసా కల్పించారు. అలానే ఓ మహిళ తన తోటల పండిన వేరుశనగ గింజలను సీఎం జగన్ కి కానుకగా ఇచ్చింది. ఇది ఇలా ఉంటే.. ఆ వృద్ధురాలి చేతిలో చేయి వేసి.. ఎంతో ఆప్యాయంగా సీఎం జగన్ పలకరించిన తీరుకు అందరు ఫిదా అయ్యారు. అలా ఆ చేయికి.. ఈ చేయి అందించాలి అంటే గొప్ప మనస్సు ఉండాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధ పడే వారిని సీఎం జగన్ తరచు కలుస్తుంటారు. ఇది కదా.. మథర్ థెరిస్సా చెప్పిన సేవా మార్గం, హ్యాట్సాఫ్ సీఎం జగన్ సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.