మనసున్న మారాజు CM జగన్‌.. గంటల వ్యవధిలోనే లక్షల సాయం

ఆపద అంటే చాలు వెంటనే ఆదుకుంటారు సీఎం జగన్‌. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎందరికో ఆర్థిక సాయం చేయగా.. తాజాగా కొందరిని ఆదుకున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

ఆపద అంటే చాలు వెంటనే ఆదుకుంటారు సీఎం జగన్‌. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎందరికో ఆర్థిక సాయం చేయగా.. తాజాగా కొందరిని ఆదుకున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

నాయకుడంటే.. పిలిస్తే పలుకుతాడు.. సాయం అంటే వెంటనే స్పందిస్తాడు.. అందరి క్షేమమే తన కల అని భావిస్తాడు.. ప్రజలందరూ బాగుంటేనే.. తాను సంతోషంగా ఉంటాడు అంటూ వర్ణించారు పెద్దలు. ఇలాంటి లక్షణాలన్ని మెండుగా ఉన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రమే తన ఇల్లు.. జనాలే ఆయన కుటుంబ సభ్యులు. వారి సంక్షేమం కోసం నిరంతరం తపిస్తారు.. శ్రమిస్తారు. వారి అభివృద్ది కోసం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందని గడప లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు అందరికి మేలు చేసేలా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు.

ఇక పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇక జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై విదేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక సంక్షేమ పథకాలు మాత్రమే కాక.. సాయం కోరుతూ తన వద్దకు వచ్చిన వారిని వెంటనే ఆదుకుంటారు సీఎం జగన్‌. క్షణాల్లో వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి వచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆయన తిరిగి ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో కొందరు బాధితులు.. విమానాశ్రయం వద్ద జగన్‌ని  కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తామంతా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఆదుకోమని అభ్యర్థించారు.

వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబును ఆదేశించారు జగన్‌. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక సీఎం జగన్‌ మంచి మనసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments