ఓటర్ల జాబితా అక్రమాలపై చంద్రబాబు ఆక్రోశం ఓటమికి సంకేతమా?

ఏపీలో ఓటర్ల జాబితాపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీపై ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఓటర్ల జాబిత అక్రమాలపై చంద్రబాబు ఆక్రోశం వారి ఓటమికి సంకేతమని టాక్ వినిపిస్తోంది.

ఏపీలో ఓటర్ల జాబితాపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీపై ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఓటర్ల జాబిత అక్రమాలపై చంద్రబాబు ఆక్రోశం వారి ఓటమికి సంకేతమని టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయాల్లో మరే రాష్ట్రంలోనూ కనిపించవు. దేశంలోనే భిన్నమైన పొలిటిక్స్ ఏపీలో కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎన్నికలు లేకున్నా ఆ స్థాయిలో రాజకీయ వేడి కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. ఏదో ఒక అంశంలో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. గతంలో చంద్రబాబు కేసులు, అంతక ముందు అమరావతి రాజధాని వంటి ఇతర అంశాలపై ఆరోపణలు ప్రత్యారోపణలు సాగాయి. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితా అంశంపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ మరోసారి ఓటమికి సంకేతమా? అనే వార్తలు వినిపిస్తోన్నాయి.

ఇటీవల ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక నిర్వహణపై  ఎన్నిక సంఘం పరిశీలించింది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను అధికారులు కలిశారు. జనసేన, టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కేంద్ర ఎన్నికల అధికారులను కలిశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాని కోరారు.

ఇక ఇదే విషయంపై  అధికార వైసీపీ కూడా స్పందించింది. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలోని బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. టీడీపీ, జనసేన చేస్తున్న ఆరోపణలపై  ఫిర్యాదులు చేసింది. అలానే జనసేన గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా ప్రకటించాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుందని టీడీపీ చేసిన ఫిర్యాదులపై  రాజకీయ విశ్లేషకలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా పారదర్శకంగానే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది. అయితే నమ్మశక్యం కానీ ఆరోపణలు చేస్తూ..టీడీపీ తన ఓటమిని అంగీకరిస్తుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ఏమైనా లోపలు జరిగితే..వాటి గురించి ప్రస్తావించాల్సిన చంద్రబాబు.. అవేవి పట్టనట్లు ప్రభుత్వంపై బురద జల్లె కార్యక్రమాల్లే చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు.. ఆ దిశగానే ఈ ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ మరో కొత్త అసత్యాన్నితెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగు ఓడిపోతామని చంద్రబాబులో భయం పడుకుందని, మరోసారి ఓడిపోతే.. ఇలా ఓటర్ల జాబితాపై నెట్టొచ్చనే భావన చంద్రబాబు ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. అందుకే ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ బాబు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా ఆయన ఓటమికి సంకేతమని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ఓటర్ల జాబితా అక్రమాలపై  చంద్రబాబు ఆక్రోశం ఓటమికి సంకేతమా అని వినిపిస్తోన్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments