ఆ రెండు కుటుంబాలకు చంద్రబాబు వెన్నుపోటు! మండిపడుతున్న తమ్ముళ్లు!

Nara Chandrababu: ఏపీలో ఎలక్షన్ రాక ముందే ఆ వాతావరణం కనిపిస్తోంది. ఇక అభ్యర్థులను ప్రకటించే పనిలో ప్రధాన పార్టీలు ఇన్నాయి. ఇదే సమయంలో టికెట్ దక్కని వారు తమ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

Nara Chandrababu: ఏపీలో ఎలక్షన్ రాక ముందే ఆ వాతావరణం కనిపిస్తోంది. ఇక అభ్యర్థులను ప్రకటించే పనిలో ప్రధాన పార్టీలు ఇన్నాయి. ఇదే సమయంలో టికెట్ దక్కని వారు తమ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైనది. అది కోల్పోయిన  వారు ఎంత పెద్ద నేత అయినా, ఏ  స్థాయి వ్యక్తి అయినా ప్రజలు, ఇతర నాయకులు పట్టించుకోరు. వారు ఎంతకాలం రాజకీయాల్లో ఉన్న ప్రజల మనస్సులో మాత్రం గుర్తింపు ఉండదు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైన నడిచే వ్యక్తి, మాట ఇస్తే తప్పని నేతగా దివంగత నేత వైఎస్సార్ కి పేరుంది. అలానే వెన్నుపోటు అనగానే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు, నేతలు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు..తన పార్టీలో ఎంతో మంది నేతలకు సీటు ఇస్తానని చివరి దాక నమ్మించి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయని టాక్. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ఉమ్మడి విశాఖ జిల్లాది ప్రత్యేక స్థానం. ఈ జిల్లాలోని ఏజెన్సీలో  ఉన్న అరకు అసెంబ్లీ స్థానం ప్రాధాన్యత కలిగినది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు వైసీపీ నే విజయం సాధిస్తూ వచ్చింది. ఇక్కడ 2014, 2019లో వైఎస్సార్ సీపీనే విజయం సాధించింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరావు టీడీపీలోకి వెళ్లారు. అనంతరం 2016లో మవోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా హత్యకు గురయ్యాడు.

అనంతరం సర్వేశ్వరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ను చంద్రబాబు తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిడారి శ్రావణ్ కుమార్ శెట్టి ఫాల్గుణ చేతిలో ఘరో ఓటమి పాలయ్యాడు. ఇక అప్పటి నుంచి అరకు సీటు విషయంలో సివేరి, కిడారి కుటుంబంలో ఎవరో ఒకరి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చినట్లు టాక్. ఇదే సమయంలో ఆ ఇద్దరు నేతలు కూడా స్థానికంగా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరికీ టీడీపీ అప్పట్లో ఇచ్చిన హామీలు పక్కకు పోయాయని  స్థానిక తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

ఇటీవలే అరకు లోయలో  చంద్రబాబు ‘రా కదలిరా” అనే కార్యక్రమం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో అరకు నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా సియ్యారి దొన్ను దొరను ప్రజలకు పరిచయం చేశారు. ఈయన 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రెబెల్ గా పోటీ చేసి 27 వేల ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిడారీ శ్రావణ్ కుమార్ కి 19 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ రెబెల్ ని ఈసారి తెచ్చి టీడీపీ తమ పార్టీ అభ్యర్ధిని చేస్తోంది.

తాజాగా బాబు తీసుకున్న నిర్ణయంతో ఎమ్మెల్యే కాకుండానే ఆరు నెలల మంత్రిగా పనిచేసిన పేరు తెచ్చుకున్న కిడారి శ్రావణ్ కుమార్ పొలిటికల్ లైఫ్ డోలాయమానంలో పడింది. మరోవైపు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన సివేరి సోమ కుమారుడు సివేరి అబ్రహాం కి 2024లో టికెట్ తప్పకుండా ఇస్తామని చెప్పి..మాట తప్పారని ఆయన అనుచరులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీకి కూడా ఠికాణా లేకుండా పోయింది అని అబ్రహాం అనుచరులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇలా వెళ్లగానే అలా అబ్రహాం అనుచరులు, తెలుగు తమ్ముళ్లు అరకు లోయలో తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.

ఇక చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించిన వెంటనే అబ్రహం మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని,  పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని, తన కాలం, ధనం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. తాను రెబెల్ గా అరకు నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అబ్రహం స్పష్టం చేశారు. తనకు అరకు అసెంబ్లీ మొత్తం మీద గట్టి బలం ఉందని తాను గెలిచి వస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇక మరో నేత కిడారి శ్రావణ్ కుమార్ అనుచరులు అయితే బయటకు ఏమీ అనడం లేదు కానీ వారిలోప కూడా నిర్వేదం కనిపిస్తోంది. ఇలా సీటు ఇస్తానని చెప్పి మాట తప్పడం బాబుకు కొత్తేమి కాదని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. బాబు వెన్నుపోటుకు ఎంతో మంది బలయ్యారని, అలాంటి వారి జాబితాలో ఈ ఇద్దరు నేతలు కూడా చేరారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. అరకు లోయలో ఆ ఇద్దరు నేతలకు బాబు వెన్నుపోటు పొడిచారు అంటూ వస్తున్న పొలిటికల్ టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments