iDreamPost
android-app
ios-app

బాబు జైలుకు.. Sr.NTR ఆత్మ ఇప్పుడు శాంతిస్తోంది: ఫ్యాన్స్

  • Author singhj Published - 08:45 PM, Sun - 10 September 23
  • Author singhj Published - 08:45 PM, Sun - 10 September 23
బాబు జైలుకు.. Sr.NTR ఆత్మ ఇప్పుడు శాంతిస్తోంది: ఫ్యాన్స్

ఒకరికి అన్యాయం చేస్తే మనకు తిరిగి అదే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. మోసం చేసిన వాళ్లు తాత్కాలికంగా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు, పదవులు పొందొచ్చు, అష్టైశ్వర్యాలు చూడొచ్చు. కానీ వాళ్ల మోసం ఎప్పటికైనా బయటపడక తప్పదు. చేసిన తప్పులు, పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని.. ఇతరులకు ఏది చేస్తే, వారికీ అదే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. దీన్నే కర్మ సిద్ధాంతంగా పిలుస్తారు. చాలా మందిలో ఈ ఫిలాసఫీ నిజమైన ఘటనలు అనేకం ఉన్నాయి. యాదృచ్ఛికమో లేదా ఏంటో తెలియదు గానీ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలోనూ ఇప్పుడిదే జరిగినట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం సంచలనంగా మారింది.

40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఫస్ట్ టైమ్ న్యాయస్థానం మెట్లు ఎక్కడం, తొలిసారి జైలుకు వెళ్లడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దివంగత ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాబు జైలుకు వెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తోందని సోషల్ మీడియా వేదికగా వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్​కు చేసిన నమ్మక ద్రోహానికి బాబు అనుభవించక తప్పదని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడిది మామా అల్లుళ్ల సంబంధం అనేది తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన కుమార్తెను బాబుకు కానుకగా ఇచ్చి పెళ్లి చేశారు. కానీ చంద్రబాబు మాత్రం మామకు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్​గా ఇచ్చారు.

అప్పట్లో చంద్రబాబును దశమ గ్రహంగా, ఔరంగజేబుగానూ సీనియర్ ఎన్టీఆర్ పోల్చారని అంటుంటారు. చంద్రబాబు అండ్ కో పెట్టిన మానసిక క్షోభతోనే సీనియర్ ఎన్టీఆర్ కన్నుమూశారనేది చరిత్ర తెలిసిన వారు చెప్పే విషయం. ఇంత చేసినా మామ ఎన్టీఆర్​ను తన సొంత ప్రాపర్టీగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం గమనార్హం. అయితే బాబు చేసిన మోసాన్ని సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. అందుకే తాజాగా స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబు తొలిసారి కోర్టు మెట్లు ఎక్కడం, ఆ తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు వెళ్తుండటంతో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబు జైలుకు వెళ్లడంతో ఇన్నాళ్లకు పెద్దాయన ఆత్మ​ శాంతించిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒకే ఒక్క స్టేటెమెంట్​తో బాబు బండారం బయటపడింది!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet