iDreamPost
android-app
ios-app

పెళ్లిరోజు నాడే జైలుకి చంద్రబాబు! ఇది కర్మ ఫలితం!

  • Author Soma Sekhar Published - 08:05 PM, Sun - 10 September 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Sun - 10 September 23
పెళ్లిరోజు నాడే జైలుకి చంద్రబాబు! ఇది కర్మ ఫలితం!

యాదృశ్చికమో.. కర్మ ఫలితమో.. కొన్ని కొన్ని సంఘటనలు జరిగేతీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇదే జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ చంద్రబాబు నాయుడు రూ.371 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడి ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేసింది. అనంతరం ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో పెళ్లిరోజు నాడే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం గమనార్హం.

చంద్రబాబు నాయుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? ఇదే రోజు అంటే సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడి పెళ్లి జరిగింది. 1981 సెప్టెంబర్ 10న చెన్నై(అప్పటి మద్రాస్)లో చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి లకు వివాహం జరిగింది.

అయితే సరిగ్గా ఇదే రోజు చంద్రబాబు జైలుకు వెల్లడం.. కర్మ ఫలితం అంటూ.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చేసిన తప్పుకు గాను సాక్షాత్తు పెళ్లిరోజే చంద్రబాబు జైలుకు వెళ్తున్నాడని, ఇది కర్మ ఫలితం కాక ఇంకేంటని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి పెళ్లిరోజే చంద్రబాబు జైలుకు వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom