Dharani
Dharani
నోరు తెరిస్తే చాలు.. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను.. ఐటీని డెవలప్ చేసింది నేనే.. కుదిరితే సత్య నాదేళ్ల, బిల్‌గేట్స్ వంటి వారికి నేనే సలహాలు ఇస్తాను అని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు.. అడ్డంగా తప్పులో కాలేశాడు. రాష్ట్రం విడిపోయి సుమారు 10 ఏళ్లు కావోస్తున్న.. ఇప్పటికి హైదరాబాద్ జపం చేస్తూ.. తాను లేకపోతే.. భాగ్యనగరం అభివృద్ధి లేదని.. తన విజన్ వల్లే ఇంత డెవలప్‌మెంట్ జరిగిందని చెప్పుకునే చంద్రబాబు.. మీడియా ముందు అడ్డంగా బుక్కయ్యారు.
నోరు తెరిస్తే విజనరీ అంటూ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పే చంద్రబాబు.. ఏకంగా జలీల్ ఖాన్‌ను మరిపించే రేంజ్‌లో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ వరకే ఆగిపోతే.. చంద్రబాబు మాత్రం ఏకంగా.. ఇంజనీరింగ్ చేయాలంటే.. ఇంటర్‌లో బైపీసీ చదవాలి అంటూ తన గొప్ప విజనరీని బయటపెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో “ఇండియా విజన్ 2047” డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన విజన్ గురించి వివరిస్తూ.. ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఒక్కసారిగా జలీల్ ఖాన్ చంద్రబాబు కన్నా ఎంతో ఉత్తమం అనే అభిప్రాయం ఏర్పరిచారు. మరి ఇంతకు చంద్రబాబు ఏమన్నారంటే..
‘‘తమ పిల్లలు ఇంజినీరింగ్ చేయాలనుకోవటం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల.. ఆ కలే విజన్. దాన్ని నెరవేర్చుకునేందుకు పిల్లల చిన్నప్పటి నుంచే వారిని ఏ స్కూల్‌లో వేయాలి.. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివించాలి.. ఇంటర్మీయట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి’’అని వివరిస్తూ పోతూ.. లాజిక్ మిస్ అయ్యారు చంద్రబాబు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెక్కడి విజనరీ బాబు.. బైసీపీ చేస్తే.. ఇంజనీర్ అవ్వొచ్చు అని మాకు తెల్వకపాయే.. మీకు మాత్రమే ఇది సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి – చంద్రబాబు నాయుడు pic.twitter.com/cHt1so9OOC
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2023