బాబు ఇసుక కుంభకోణంలో అసలు లెక్క ఇది: జర్నలిస్ట్‌ సాయి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు  ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల అల్లర్ల, మద్యం స్కాంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇసుక స్కామ్ లో కూడా చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కుంభకోణంలో అసలు లెక్క ఇదే అంటూ ప్రముఖ జర్నలిస్ట్ సాయి పలు అంశాలను వెల్లడించారు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు  ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల అల్లర్ల, మద్యం స్కాంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇసుక స్కామ్ లో కూడా చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కుంభకోణంలో అసలు లెక్క ఇదే అంటూ ప్రముఖ జర్నలిస్ట్ సాయి పలు అంశాలను వెల్లడించారు

ప్రస్తుతం ఏపీలో రాజకీయం చంద్రబాబు చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు, కోర్టు విచారణలు, ఇతర కేసుల చుట్టే ఏపీ రాజకీయం నడుస్తుంది. ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి వదిలేసి.. చంద్రబాబు సమస్యల గురించి ఆలోచిస్తున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు  ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల అల్లర్ల, మద్యం స్కాంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇసుక స్కామ్ లో కూడా చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కుంభకోణంలో అసలు లెక్క ఇదే అంటూ ప్రముఖ జర్నలిస్ట్ సాయి పలు అంశాలను వెల్లడించారు.

చంద్రబాబు నాయుడుపై పెట్టిన ఇసుక కుంభకోణం కేసులో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు జర్నలిస్ట్ సాయి వివరించారు. ” చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి జీవో నం.94గా ఇసుక అంశం రిజిస్టర్ చేశారు. ఈ జీవో ఇచ్చే నాటికి అంటే..కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 459 ఇసుక రీచ్ లు ఉన్నాయి. ఈ రీచ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం క్యూబిక్ మీటర్ కి రూ.40 వసూలు చేసేందుకు అధికారం ఇచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత క్యూబిక్ మీటర్ కి రూ.650 చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రూ.120 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అంటే రూ.40 లెక్కన 120 కోట్ల ఆదాయం వస్తే.. అదే లెక్కన రూ.650కి దాదాపు రూ.1920 కోట్లు రావాలి.

డ్వాక్ర మహిళలకు ఇచ్చి.. ఈ ఇసుక రీచ్ లను నడిపిస్తామని టీడీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే పేరుకే డ్వాక్ర మహిళలను కానీ.. వెనుకుండి నడిపించేంది ఆ పార్టీకి చెందిన నేతలు. అందుకు ఉదాహరణే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని. రూ.650 క్కూబిక్ మీటర్ కి వసూలు చేయడం ద్వారా 1920 కోట్లు రావాల్సి ఉంటే 680 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 1240 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని మీద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన మంత్రి వర్గ  ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో దేవినేని ఉమ, పీతల సూజత సభ్యులుగా ఉన్నారు.

16 నెలల్లో 2000వేల కోట్ల ఇసుకుని మాఫీయా అక్రమంగా తినేసిందని తేల్చేచారు. అది కూడా ఆ పార్టీ లోని స్థానిక నేతలే. అయితే దీనిపై ప్రభుత్వానికి ఏమని సిఫారుసు ఇచ్చారు అనేది తెలియదు. ఈ విధంగా దాదాపు వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది. అయితే జగన్ సర్కార్ చెప్పిన స్థాయిలో కాకపోయినా భారీగానే ఇసుక కుంభకోణం జరిగింది. జన్మభూమి కమిటీ సభ్యలు మొదలు, మంత్రుల వరకు అందరూ ముడుప్పులు ముట్టాయి. ఈ కుంభకోణం గురించి అసలు నిజాలు ఏసీబీ కోర్టులోనే తేలాలి” అంటూ సాయి ఇసుక కుంభకోణం గురించి వివరించారు. మరి.. సాయి చెప్పిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments