iDreamPost
android-app
ios-app

రేపటి నుండి ఏపీలో సమగ్ర కులగణన.. 10 రోజుల పాటు ఇళ్ల వద్దే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేపటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టనుంది. కులగణన ద్వారా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేపటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టనుంది. కులగణన ద్వారా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రేపటి నుండి ఏపీలో సమగ్ర కులగణన.. 10 రోజుల పాటు ఇళ్ల వద్దే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. నవ రత్నాల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందజేస్తోంది. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ అండగా నిలుస్తోంది. ఇక, ఈ నేపథ్యంలోనే ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సంక్షేమం పథకాలు అన్ని వర్గాల వారికి మరింత చేరువ చేయాలనే ఉద్ధేశ్యంతో కులగణన కార్యక్రమం చేపట్టింది.

రాష్ట్రంలో రేపటినుంచి… అంటే జనవరి 19వ తేదీనుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అధికారులు ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి కుల గణన వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను డిజైన్‌ చేశారు. ఈ- కేవైసీ – 726 కులాల జాబితాతో ఈ యాప్ రూపొందింది. మొత్తం 1.67 కోట్ల కుటుంబాల పరిధిలో కులగణన జరగనుంది. గత ఏడాది నవంబర్‌ 3వ తేదీన ఏపీలో సమగ్ర కుల ఆధారిత జనాభా గణన నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఈ మేరకు కులాల వారీగా సర్వే నిర్వహణకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ జనవరి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాల వివరాలను ఈ కుల సర్వేలో పొందు పరచనున్నారు. జన గణనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు కోసం ఎన్యుమరేటర్లు ప్రజల ముఖ, కనుపాప, ఇతర వివరాలను సేకరించనున్నారు. ఈ కుల గణన ద్వారా మెరుగైన విధాన రూపకల్పనతో పాటు, పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగనుంది.

ఈ నెల 19 నుంచి 28 వరకు గ్రామాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులు, పట్టణాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి కుల గణన చేపట్టనున్నారు. ఫిబ్రవరి 15 నాటికి పూర్తి స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ స్థాయిల్లో కుల గణన పూర్తి కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు ముందుగానే ఉత్తర్వులు వెళ్లాయి. మరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటినుంచి ప్రారంభం కానున్న కుల గణన కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.