iDreamPost
android-app
ios-app

వరద బాధితులకు BRS సాయం! ప్రజాప్రతినిధుల నెల వేతనం విరాళం!

BRS Donation One Month Salary For Flood Victims: ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

BRS Donation One Month Salary For Flood Victims: ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

వరద బాధితులకు BRS సాయం! ప్రజాప్రతినిధుల నెల వేతనం విరాళం!

ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాలను అతలాకుతలం చేశాయి. పలు ప్రాంతాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఎంతో మంది వరదల దాటికి సర్వం కోల్పోయారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నారు. ఈ వరదల కారణంగా ఎంతో మంది ఆర్థికంగా చితికపోయారు. ఇళ్లను కోల్పోయి.. రోడ్డున పడ్డారు. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరదబాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో వరద బాధితుల కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతం ఇస్తున్నట్లు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. కేసీఆర్ ఆదేసాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ వారి నెల జీతం వరదల బాధితులకు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. సిద్ది పేట కౌన్సిలర్ల నెల జీతం కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం వరద బాధితులకు సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని  తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రూ.11 వేలు విరాళం ఇచ్చారని తెలిపారు.  రేపు  సిద్ధిపేట నుంచి ఖమ్మంకు సరుకు తీసుకెళ్లి.. ఇంటింటికి అందిస్తామని తెలిపారు. మొత్తం 6 లారీల్లో ఖమ్మంకు సరుకులను పంపుతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

మంగళవారం బీఆర్ఎస్ నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటించిన సంగతి  తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఖమ్మం, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు వరద ప్రాంతాల్లో పర్యటంచారు. పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజాప్రతినిధులే కాకుండా పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు సహాయ చర్యల్లో మమేకమవుతున్నారు. ఇదే సమయంలో  మరింత సాయంగా ఈ విరాళాలను ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు. మరి.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.