iDreamPost
android-app
ios-app

కల్యాణ మండపం నుంచి పెళ్లికూతురు మాయం.. సినీ లెవెల్ స్కెచ్

  • Published Oct 25, 2024 | 4:02 PM Updated Updated Oct 25, 2024 | 4:02 PM

ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు బాగా రెచ్చిపోతున్నారు. సినిమా ప్రభావం వీరిపై పడుతుందో.. లేదా ఇలాంటి వాటిని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు. కానీ అచ్చం అలానే చేస్తున్నారు. తాజాగా మరొక ఘటన అందరిని ఆశ్చర్య పరుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు బాగా రెచ్చిపోతున్నారు. సినిమా ప్రభావం వీరిపై పడుతుందో.. లేదా ఇలాంటి వాటిని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు. కానీ అచ్చం అలానే చేస్తున్నారు. తాజాగా మరొక ఘటన అందరిని ఆశ్చర్య పరుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 25, 2024 | 4:02 PMUpdated Oct 25, 2024 | 4:02 PM
కల్యాణ మండపం నుంచి పెళ్లికూతురు మాయం.. సినీ లెవెల్ స్కెచ్

పీఠల మీద పెళ్లి ఆగిపోయే సీన్స్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో , సీరియల్ లో చూసే ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది.. ఇక తాళి కట్టడం ఒక్కటే బ్యాలన్స్ అనుకునే టైమ్ కి ఆపండి.. అంటూ ఎవరో ఒకరు పెళ్లి ఆపేస్తూ ఉంటారు. మరి కొన్ని సినిమాల్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పెళ్లి కూతురు ఆఖరి నిమిషంలో.. మండపం నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి టైం కు హీరో హీరోయిన్ ను బైక్ పై తీసుకువెళ్లిపోయే సీన్స్ ఇంకొన్నో ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు చాలా రీల్ సీన్స్ ను చూసి ఉంటారు. అయితే సినిమాలను చూసి జనాలు నేర్చుకుంటున్నారో.. లేదా నిజంగా జరుగుతున్న సంఘటనలను చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు. కానీ , అచ్చం ఇలాంటి సీన్ ఒకటి తాజాగా రియల్ లైఫ్ లో రిపీట్ అయింది.

అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కూతురు వైష్ణవికి.. క్రిష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి .. పెద్దలు పెళ్లి కుదిర్చారు. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి మండపం నిర్ణయించేవరకు కూడా అంతా సాఫీగా సాగిపోయింది. ఇక తెల్లవారితే పెళ్లి.. ఈ క్రమంలోనే ఆ రాత్రి వారి సంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం , పెద్ద తాంబూలం కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక ఏముంది తెల్లవారితే మండపంలో వధూ వరులను పెళ్లి పీఠల మీద చూడడం, వారిని ఆశీర్వదించడం మాత్రమే బ్యాలెన్స్. ఇక ఇరు కుటుంబ సభ్యులు ఆ హడవిలోనే ఉన్నారు.  కానీ సీన్ కట్ చేస్తే తెల్లవారేసరికి పెళ్లి కూతురు మాయం. మరి కొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి.. అర్దాంతరంగా ఆగిపోయింది. అకస్మాత్తుగా ఎవరు ఊహించని విధంగా పెళ్లి నిలిచిపోవడంతో.. అప్పటివరకు పెళ్లి సంబరాలతో వెలిగిపోయిన వారి మోహాలు వెలవెలబోయాయి. పీఠల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో పెళ్ళికొడుకు నివ్వెరపోయాడు.

పెళ్లి ఆగిపోవడం .. కుమార్తె ఎక్కడికి వెళ్ళిందో.. ఏమైపోయిందో తెలియకపోవడంతో ఆ కన్న తండ్రి గుండె ఆగినంత పనియ్యంది. తల్లి తండ్రులు , బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. నలుగురు నానా మాటలు అనడం మొదలుపెట్టారు. అటు పెళ్లి కొడుకు తరుపు బంధువులు కూడా నిరుత్సాహంగా ఉండిపోయారు. తీరా అమ్మాయి గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. తెల్లవారు జామున 4 గంటల సమయంలో.. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కల్యాణ మండపం నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోయింది. ఆ మండపం నుంచి ఓ అబ్బాయి బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనితో ఈ అసలు మ్యాటర్ బయటపడింది. ఇక ఇలాంటివేమైనా ఉంటే పెళ్ళికి ముందే చేసుకోవాలంటూ.. అన్నీ మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి ఇలా చేయడం పద్దతి కాదంటూ.. పెళ్లి కొడుకు తరపు వారు పెదవి విరుస్తున్నారు. వారు చెప్పిన దానిలో వాస్తవం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో అడపా దడపా ఇలా ఆఖరి వరకు వచ్చి ఆగిపోతున్న పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న యువత దూకుడుతనం చూస్తుంటే.. ఇలాంటి వార్తలు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో ఏమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking