iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లి కూతురు కంట్లో కారం కొట్టి మరీ కిడ్నాప్.. ఎక్కడంటే?

  • Published Apr 22, 2024 | 2:49 PM Updated Updated Apr 22, 2024 | 2:49 PM

Bride is Kidnapped: ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలో సోషల్ మీడియాల్లో ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ పెళ్లి కూతురు కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Bride is Kidnapped: ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలో సోషల్ మీడియాల్లో ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ పెళ్లి కూతురు కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

వీడియో: పెళ్లి కూతురు కంట్లో కారం కొట్టి మరీ కిడ్నాప్.. ఎక్కడంటే?

ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని భయపెట్టే విధంగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చాలా మంది తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇందుకోసం రక రకాల సాహసాలు చేస్తుంటారు.  మరికొద్దిసేపట్లో పెళ్లి.. బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో ఫంక్షన్ హాల్ సందడిగా ఉంది. అంతలోనే కొంతమంది వ్యక్తులు ఫంక్షన్ హాల్ లోకి కారం చల్లుతూ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటనలో వరుడికి గాయాలు అయ్యాయి. పెళ్లి కూతురుని ఆమె బంధువులు ఎత్తుకెళ్లారు. సినీమా స్టయిల్ లో ఈ సంఘటన జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి కూతురుని బలవంతంగా కిడ్నాప్ చేస్తున్న వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వీడియలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా రాజమండ్రి రూరల్ కడియంలో సినీ ఫక్కీలో ఓ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కడియంలో పెళ్లి జరుగుతుండగా కొంతమంది పెళ్లి కూతురు కంట్లో కారం చల్లి ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి పీటల మీద నుంచి లాక్కొని కింద పడేసి కొంతమంది ఆడవాళ్లు.. మగవాళ్లు ఆమెపై చేయి చేసుకుంటూ లాక్కెళ్లారు. అయితే పెళ్లి కూతురు మాత్రం తాను రానంటూ ఏడుస్తుంది. వారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది.

కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకట నందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావు పేటలోని ఓ కాలేజ్ లో డిమ్లామా చేశాడు. కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన గంగవరం స్నేహ తో పరిచయం ఏర్పిడింది వీరి పరిచయం ప్రేమగా మారి చదువుకునే సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే పెద్దల తమ ప్రేమను అంగీకరించరని భయపడ్డారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13 న విజయవాడలోని దుర్గ గుడిలో పెళ్లిచేసుకున్నారు. అనంతరం వెంకటనందు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో బంధువుల సమక్షంలో ఈ నెల 21 న ఆదివారం ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నామని వధువు తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు. పెళ్లి ఫంక్షన్ అడ్రస్ కూడా ఇచ్చింది పెళ్లికూతురు. ఈ క్రమంలోనే ముహూర్త సమాయినికి ఫంక్షన్ హాల్ కి వచ్చిన పెళ్లి కూతురు బంధువుల నానా రచ్చ చేసి ఆమెను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş