iDreamPost
android-app
ios-app

AP Power Corporations: AP విద్యుత్ సంస్థలకు జాతీయ స్థాయి అవార్డులు!

ఏపీ సర్కార్ కి ఇప్పటి వరకు అనేక జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. తాజాగా మరో రెండు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సహకారంతోనే ఈ అవార్డులు లభించాయని అధికారులు పేర్కొన్నారు.

ఏపీ సర్కార్ కి ఇప్పటి వరకు అనేక జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. తాజాగా మరో రెండు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సహకారంతోనే ఈ అవార్డులు లభించాయని అధికారులు పేర్కొన్నారు.

AP Power Corporations: AP విద్యుత్ సంస్థలకు జాతీయ స్థాయి అవార్డులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు అనేక అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక అవార్డులను  సొంతం చేసుకుంది. విద్యా, వైద్య, పోలీస్ విభాగాల్లో జగన్ సర్కార్ పలు అవార్డులను కైవసం చేసుకుంది. అలానే ప్రపంచ స్థాయిలో కూడ అనేక ప్రశంసలను ఏపీ ప్రభుత్వం అందుకుంది. ఇలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, సంస్కరణలకు ఈ అవార్డులో కొలమానం. అలానే ఏపీ విద్యుత్ సంస్థలు కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా రాష్ట్ర విద్యుత్  సంస్థలు మరోసారి తమ ప్రతిభను నిరూపించాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్  విద్యుత్ సంస్థలు రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.  ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్ మెంట్ అప్లికేషన్ కు గానూ స్కోట్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్(ట్రాన్స్ కో) కైవసం చేసుకుంది. అప్లికేషన్ ను ఏపీ స్టేట్ లోడ్ డిస్పాట్ సెంటర్ అభివృద్ధి చేసింది. అదే విధంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట లను ప్రోత్సహించినందుకుగాను ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ సొంతం చేసుకుంది.

ఇక ఈ రెండు అవార్డులు  రావడానికి గల కారణలు ఏమిటంటే.. డిస్కంలు ఓపెన్ యాక్సెస్ వినియోదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రంలో వివిధ పరవ్ డెవలపర్లు అనేక పవర్ ప్లాంట్ లను ప్రారంభించారు. డిస్కంల  ఓపెన్ యాక్సిస్ వినియోదారుల్లో వేగవంతమైన పెరుగుదల కారణంగా, నోడల్ ఏజెన్సీ అయిన ఏపీఎస్ఎల్ డీసీ, ఎనర్టీ బిల్లింగ్ సెంటర్ సకాలంలో నెలవారీ విద్యుత్, డిమాండ్స సెటిల్‌మెంట్లు చేయటం కష్టంగా మారింది. దీంతో బహుళ ఓపెన్‌ యాక్సెస్‌ కస్టమర్లు వివిధ ఓపెన్‌ యాక్సెస్‌ జనరేటర్ల నుంచి కరెంట్ సప్లయ్ ను పొందడంలో జాప్యం జరిగేది. దీంతో ఏపీఎస్‌ఎల్‌డీసీ  ఇంటర్నల్ ఐటీ బృందం ఓపెన్‌ యాక్సెస్‌ సెటిల్మెంట్‌ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇంట్రా స్టేట్‌ ఓపెన్‌ యాక్సెస్‌ సెటిల్‌మెంట్‌ ఫిచర్ ను డెవలప్ చేసింది. దీనివల్ల ఈ ప్రక్రియ ఈజీ అయ్యింది. ఇక పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ను ప్రోత్సహించడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది.

44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం ఉన్న 39 అనువైన ప్రాంతాల్లో టెక్నో కమర్షియల్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్స్‌ ను నెడ్‌కాప్‌ రూపొందించింది.  అదే  విధంగా 1680 మెగావాట్ల పంప్ట్ స్టోరేజ్ ప్రాజెక్ట్, 2300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండో పవర్ కేపాసిటీలతో కూడిన 4280 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ పాణ్యం మండలం పిన్నాపురం వద్ద నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఈ కీలకమైన చర్యలు జాతీయ స్థాయిలో ఏపీ విద్యుత్ సంస్థలకు అవార్డులు రావడానికి కారణమయ్యాయి. ఇక ఈ అవార్డులు రావడంపై ఇంధన, విద్యుత్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతోనే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధిస్తున్నాయని అధికారులు అన్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis