Arjun Suravaram
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ అనే కార్యక్రమంలో చంద్రబాబు పై మంత్రి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ అనే కార్యక్రమంలో చంద్రబాబు పై మంత్రి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షం ఒకటి అంటే.. అధికార పక్షం నేతలు రెండు అంటున్నారు. వైసీపీ నేతలు, మంత్రులు నారా చంద్రబాబు నాయుడిపై, టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా రాష్ట్ర గృహ, నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడని మంత్రి జోగి రమేశ్ ఎద్దేవ చేశారు. గురువారం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
గురువారం రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయితే..తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. కాబట్టి ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తరువాత ఎవరూ బయటకు రాలేదని, వాళ్ల జాతి తప్ప మరెవరూ బయటికి రాలేదని మంత్రి దుయ్యబట్టారు. “వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. వైఎస్ జగన్ నే ఏపీకి సీఎంగా ఉండటం చారిత్రాత్మకమైన విషయం. రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
సీఎం జగన్ పాలన మాకు కావాలి. మా బిడ్డల భవిష్యత్తుకు జగన్ సీఎం కావాలి. మా కుటుంబ ఆర్థికి స్థితిగతులు ఎదగడానికి కావాలి. మా ఆరోగ్య పరిరక్షణకు ఔషధంలా పని చేస్తున్న జగనన్న మాకు కావాలి. ఇలా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది గడపలకు బటన్ నొక్కి..నేరుగా డబ్బులు పంపించారు. ఆ డబ్బులతో మా కుటుంబాలు సంతోషంగా, ఆర్థికంగా బాగున్నాయని ప్రతి అక్క,చెల్లి చెబుతున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది.. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ చేసి చూపించారు” అని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి గడపకు వైసీపీ నేతలు వెళ్లారు. తాజాగా సామాజిక, సాధికారక బస్సుయాత్ర, వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ అనే మరో రెండు కార్యక్రమాలతో మరోసారి ప్రజల్లోకి వైసీపీ నేతలు వెళ్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అలానే గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి గల తేడాని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ద్వారానే ఏమైనా సమస్యలు ఉంటే.. ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ అనే ప్రోగ్రామ్ నేపథ్యంలోనే మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుపై మండిపడ్డారు. మరి.. చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.