iDreamPost
android-app
ios-app

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ దారుణం వెనక ఓ యువతి.. 28 కెమరాలు.. 300 వీడియోలు..!

  • Published Aug 30, 2024 | 12:01 PM Updated Updated Aug 31, 2024 | 8:18 AM

Gudlavalleru Engineering College Hidden Camera Incident: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

Gudlavalleru Engineering College Hidden Camera Incident: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Aug 30, 2024 | 12:01 PMUpdated Aug 31, 2024 | 8:18 AM
Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ దారుణం వెనక ఓ యువతి.. 28 కెమరాలు.. 300 వీడియోలు..!

ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు మోసిన ఇంజనీరింగ్‌ కాలేజీ హస్టల్లో గర్ల్స్‌ బాత్రూంలో సీక్రెట్‌ కెమరాలు పెట్టారంటూ విద్యార్థినిలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. ఓ విద్యార్థిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. అతడిపై దాడి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్‌ వద్దకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతటి దారుణం జరగడానికి కారణం.. అదే హాస్టల్‌లో ఉంటున్న బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థిని అని తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందని.. పైగా ఆయువతి తండ్రికి రాజకీయ నేపథ్యం ఉందని సమాచారం. ఈ దారుణ ఘటన పూర్తి వివరాలు మీకోసం..

కృష్ణాజిల్లా, గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమరాలు పెట్టి.. అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి.. వాటిని డార్క్‌ వెబ్‌కు అమ్ముతున్నారని తెలిసింది. సుమారు 300 వీడియోలు రికార్డ్‌ చేశారు. ఇక లేడీస్‌ బాత్రూంలో హిడెన్‌ కెమరాలు పెట్టింది కూడా స్టూడెంటే. ఆమె అదే కాలేజీలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బెదిరింపులకు భయపడి ఈ పని చేసినట్లు సమాచారం.

వీడియోతో బ్లాక్‌మెయిల్‌..

ఫైనలియర్‌ విద్యార్థిని.. అదే కాలేజీకి చెందిన ఓ స్టూడెంట్‌ని లవ్‌ చేసింది. కొన్నాళ్ల క్రితం ఇద్దరు కలిసి ఓయో రూమ్‌కి వెళ్లారు. వారిద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రికార్డ్‌ చేశాడు. తర్వాత ఆ వీడియోను అతడి స్నేహితులకు షేర్‌ చేశాడని తెలుస్తోంది. వారంతా కలిసి ఫైనలియర్‌ విద్యార్థినిని బెదిరించసాగారు. తాము చెప్పినట్లు వినకపోతే వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించారు. దీనిలో భాగంగానే గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాలు పెట్టాలని చెప్పారు. దాంతో ఆమె ఈ దారుణానికి ఓడిగట్టింది. హాస్టల్‌లోని గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాలు ఫిక్స్‌ చేసింది. ఇక గత కొంత కాలంగా.. విద్యార్థినిల వీడియోలు రికార్డ్‌ చేస్తూ.. వాటిని రోజు వారి ప్రతిపాదికన డార్క్‌ వెబ్‌కు అమ్ముతున్నారని వెల్లడయ్యింది.

తండ్రికి చెప్తే.. రివర్స్ లో బెదిరింపులు..

గత 2 నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం.. వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో విద్యార్థినిలు ఈ దారుణంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ సదరు యువతి తండ్రికి కాల్‌ చేసి చెప్పగా.. కుమార్తెకు బుద్ధి చెప్పాల్సిన అతడు.. ప్రిన్సిపాల్‌ మీదనే రివర్స్‌ అయ్యాడని.. తన కుమార్తె పేరు బయటకు వస్తే.. కాలేజీ మీద డ్రగ్స్‌ కేసు పెట్టి.. విచారణ జరిపించి మూసివేయిస్తానని బెదిరింపులకు దిగాడని తెలుస్తోంది. ఇందుకు సంబందించి వాట్సాప్‌ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక హిడెన్‌ కెమరాల వ్యవహారంలో పోలీసులు ఫైనల్‌ ఇయర్‌ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. హాస్టల్‌ వద్దకు చేరుకుని.. అనుమానిత విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినిల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మండిపడుతున్నారు.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahis