AP Govt-Free Laptop Scheme 2024: AP విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీగా రూ.30 వేల ల్యాప్‌టాప్‌.. ఎలా అప్లై చేయాలంటే

AP విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీగా రూ.30 వేల ల్యాప్‌టాప్‌.. ఎలా అప్లై చేయాలంటే

Free Laptop: ఉన్నత విద్య చదువుతోన్న ఏపీ విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఉచితంగా ల్యాప్‌టాప్‌ పొందే అవకాశం ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

Free Laptop: ఉన్నత విద్య చదువుతోన్న ఏపీ విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారు ఉచితంగా ల్యాప్‌టాప్‌ పొందే అవకాశం ఇవ్వనున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఏపీ విద్యా విధానంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్‌ స్కూల్స్‌లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ.. కార్పొరేట్‌ పాఠశాలలకు పోటీగా వాటిని మార్చశారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలని.. పిల్లల చదువు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న చేయూత, విద్యా దీవేన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, గోరు ముద్ద వంటి పథకాలను తీసుకువచ్చారు.

అంతేకాక మారుతున్న కాలంతో పాటు విద్యా విధానంలో కూడా మార్పులు తేవడం కోసం డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేశారు సీఎం జగన్‌. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డిజిటల్‌ బోర్డులు, కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు చదువుతోన్న స్టూడెంట్స్‌కి 30 వేల రూపాయల ఖరీదైన ల్యాప్‌టాప్‌ను ఉచితంగా ఇస్తున్నారు సీఎం జగన్‌. మరి ఆ పథకం వివరాలు ఏంటి.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2024ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ కింద దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ ఇవ్వనున్నారు. దివ్యాంగులైన, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు ఈ ఉచిత ల్యాప్‌టాప్‌ పథకానికి అర్హులు. వీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వారు.. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://apdascac.ap.gov.in విజిట్‌ చేయాలి.

తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువగా ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ ఉచిత ల్యాప్‌టాప్ పథకానికి అర్హులు. ఒకవేళ తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15,000-రూ.20,000 మధ్య ఉంటే, అలాంటి విద్యార్థులు సగం ధర చెల్లించి ల్యాప్‌టాప్ పొందగలరు. అదే తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.20వేల కంటే ఎక్కువ ఉంటే, ల్యాప్‌టాప్ కోసం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఏమేం కావాలంటే..

ఈ ఉచిత ల్యాప్‌టాప్ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే.. సదారెమ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, తల్లిదండ్రుల ఆదాయలకు సంబంధించిన సర్టిఫికెట్, మొబైల్ నంబర్, స్కూల్/కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు అవసరం అవుతాయి. ఈ ల్యాప్‌టాప్‌లను దివ్యాంగుల సంక్షేమ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పంపిణీ చేస్తారు. లేదా ఏపీ దివ్యాంగ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పంపిణీ చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి http://apdascac.ap.gov.in కి వెళ్లాలి.
  • అక్కడ “online application” ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
  • ఆ తర్వాత “click here to apply for the differently-abled scheme” క్లిక్‌ చెయ్యాలి.
  • ఇప్పుడు “Application for Sanction of Laptops” ఆప్షన్ ఎంచుకోవాలి.
  • తర్వాత “Apply online” ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
  • అందులో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి కొత్త పాస్‌వర్డ్‌ని 2 సార్లు టైప్ చెయ్యాలి.
  • సబ్‌మిట్ కొట్టాక, మీకు ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది. వాటితో మీరు లాగిన్ అవ్వాలి.
  • ఇందుకోసం apply online ఆప్షన్ క్లిక్ చెయ్యాలి.
  • అప్పుడు ఉచిత ల్యాప్ టాప్ కోసం ఫారమ్ ఫిలప్ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి.
  • చివరగా సబ్‌మిట్ బటన్‌ కొడితే.. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లే.

ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే..

మీరు ఆన్‌లైన్ బదులు.. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, నింపి, దానికి అవసరమైన పత్రాలను కలిపి, ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ, సీనియర్ సిటిజన్ అసిస్టెన్స్ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఇవ్వొచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇచ్చే వివరాలన్నీ వాస్తవం అయివుండాలి. లేదంటే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని ప్రభుత్వం తెలిపింది.

Show comments