APలో వారందరికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు జమ

Jagananna Thodu: ఏపీలో మరో పథకానికి సంబంధించిన నేడు ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమచేయనున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

Jagananna Thodu: ఏపీలో మరో పథకానికి సంబంధించిన నేడు ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమచేయనున్నారు సీఎం జగన్‌. ఆ వివరాలు..

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం రకరకాల పథకాలు తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. నవరత్నాల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో.. ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్‌. కేవలం మహిళలు, విద్యార్థులు మాత్రమే కాక.. చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పండుగ ముందు వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమ చేయనుంది. ఆ వివరాలు..

చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. తమతో పాటు మరి కొందరికి ఉపాధి కల్పిస్తున్న వారికి జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడటం కోసం జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కింద నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయడం కోసం.. ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తోంది ప్రభుత్వం.

అంతేకాక రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి పది వేల రూపాయలకు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తుంది జగన్‌ సర్కార్‌. ఇవాళ అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ. 13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. ఇక ఇవాళ అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు కావడం విశేషం.

అర్హులు..

  • 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు ఈపథకానికి అర్హులు.
  • అలానే తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు
  • రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు..
  • సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు.
  • అంతేకాదు గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు..
  • చేనేత, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరువ్యాపారులను కూడా ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నారు.
Show comments