Venkateswarlu
ఈ ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ప్రవేశ పెట్టింది.
ఈ ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ప్రవేశ పెట్టింది.
Venkateswarlu
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా కానుక ప్రకటించారు. డీఏకు సంబంధించి ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు 3.64 శాతం డీఏ అందనుంది. ఈ మేరకు రేపు డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురును అందించింది.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ప్రవేశ పెట్టింది. సభ్యుల ఆమోదంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గవర్నర్ ఆమోదం కూడా పొందటంతో.. ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు.
జూన్ 2వ తేదీ 2014 కంటే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారికి ఇది వర్తించనుంది. కాగా, నిరుద్యోగులకు కూడా సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపు -2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో 508 పోస్టులకు గాను జీవో రాగా.. సీఎం జగన్ ఆదేశాలతో 212 పోస్టులు పెంచింది. ఈనేపథ్యంలో అతి త్వరలో 720 పోస్టుల భర్తీకి గాను ఏపీపీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయనుంది. మరి, ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందించిన ఈ దసరా కానుకలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.