AP విద్యార్థులకు శుభవార్త.. జూన్‌ నుంచి పాఠశాలల్లో అది అమలు

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్‌లో పాఠశాలలు ప్రారంభం అయిన నాటి నుంచే ప్రభుత్వ బడుల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్‌లో పాఠశాలలు ప్రారంభం అయిన నాటి నుంచే ప్రభుత్వ బడుల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

2019 ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కొన్ని రంగాల్లో కీలక సంస్కరణలకు తెర దీశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా సమయంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యాన్ని.. ఉచితంగా.. అందజేస్తున్నారు. ఇందుకోసం విద్యావైద్య రంగాల్లో అనేక సంస్కరణలకు శ్రీకారం చూట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సహా.. నాడు-నేడు కింద వాటి రూపు రేఖలు మార్చారు. ఇక విద్యార్థుల ప్రతి అవసరాన్ని తీర్చడమే కాక వారికి పోషకాహరం అందిస్తూ.. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో.. వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇక ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గవర్నమెంట్‌ స్కూల్స్‌లో చదివే విద్యార్థులు.. సాంకేతికను అందిపుచ్చుకుని.. ప్రపంచంతో పోటీ పడే దిశగా వారిని ప్రోత్సాహించడం కోసం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో.. స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 7,094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం జూన్‌ 12 నాటికి 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపికచేసి వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.

ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధానంలో భాగంగా ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో కొంతమందిని ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్‌గా ఎంపిక చేస్తారు. వారితో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ బోధన, అభ్యసనం గురించి అవగాహన కల్పిస్తారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక విషయమై ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపల్స్‌తో మాట్లాడాలని ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ఆర్జేడీలు, డీఈవోలకు సూచనలు జారీ చేసింది.

మరోవైపు ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధుల నిర్వహణపై కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ల మధ్య ఇప్పటికే మ్యాపింగ్ పూర్తయ్యిందని ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నుంచే ప్రతి మూడు స్కూళ్లకు ఒక ఎక్స్‌పర్ట్‌ను నియమిస్తామని వెల్లడించారు. జూన్ 10న ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక కోసం ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 12వ తేదీ నాటికి 26 జిల్లాల్లోని ప్రతి మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్‌ను నియమిస్తామని చెప్పుకొచ్చారు. దీని వల్ల విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చకోవడంలో నిష్ణాతులుగా మారతారని ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పుకొచ్చారు.

Show comments