AP: ఒక్కసారిగా పేలిన పెట్రోల్‌ బంక్‌.. అసలేం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్‌, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడిలో తీవ్ర కలకలం రేగింది. ఉన్నట్లుండి పెద్ద శబ్దం వినిపించింది. దాంతో జనాలు భూకంపం వచ్చిందేమోనని భయపడి బయటకు పరుగులు తీశారు. నిమిషం పాటు ప్రాణభయంతో బిగుసుకుపోయారు. ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చాక అసలు విషయం తెలిసింది. భూకంపం రాలేదు కానీ.. అంతకు మించిన ప్రమాదం చోటు చేసుకుందని అర్థం అయ్యింది. ఇంతకు ఏంజరిగింది అంటే.. పెట్రోల్‌ బంక్‌ పేలింది. అవును మీరు విన్నదే నిజమే. పెట్రోల్‌ బంక్‌ పేలడంతోనే.. అంత భారీ శబ్దం వచ్చింది. జనాలు భూకంపం వచ్చిందేమోనని భయపడ్డారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

తొస్సిపూడిలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ మంగళవారం ఉదయం ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయ్యింది. మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే.. తొస్సిపూడిలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ పక్కనే బాణాసంచా నిల్వ ఉంచారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. మంగళవారం ఉదయం ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో.. పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌కు కూడా నిప్పు అంటుకుంది. అసలే పెట్రోల్‌.. ఆపై నిప్పు.. ఇంకేముంది క్షణాల వ్యవధిలో ఒక్క సారిగా పెట్రోల్‌ బంక్‌ బ్లాస్ట్‌ అయ్యింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఇక ఈ ప్రమాదం ఉదయం పూట జరగడంతో.. పెద్దగా జనసంచారం లేకపోవడం వల్ల.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదం వల్ల బంక్‌ పక్కనే ఉన్న ఓ రైస్‌ మిల్లు స్వల్పంగా ధ్వంసమైంది. బంక్‌ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. దాంతో భూకంపం వచ్చిందేమోనని భావించిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Show comments