iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు తెలుసా!

ఏపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఇలా రేషన్ సప్లయ్ జరగడం ప్రారంభమైంది. అయితే ఈ రేషన్ పంపిణీ విషయంలో అవినీతి, అక్రమాలకు చోటులేకుండా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

ఏపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఇలా రేషన్ సప్లయ్ జరగడం ప్రారంభమైంది. అయితే ఈ రేషన్ పంపిణీ విషయంలో అవినీతి, అక్రమాలకు చోటులేకుండా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు తెలుసా!

ఎన్నో ఏళ్లుగా రేషన్ పంపిణీ అనేది జరుగుతూనే ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో  జరుగుతుంది. ఇక రేషన్ కార్డు అనేది ప్రజల ఆర్థిక స్థితిని బట్టిన జారీ చేస్తారు. అంతేకాక రేషన్ కార్డు జారీలో అనేక నిబంధనలు ఉంటాయి.  తెల్లరేషన్ కార్డుతో పాటు మరో రెండు రకాల కార్టులు కూడా ఉన్నాయి.  ఇక రేషన్ సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా పక్కగా ప్రజలకు రేషన్ సరకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత  ఇంటి వద్దకే రేషన్ సరకును సప్లయ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సీఎం అధికారంలోకి వచ్చిన తరువాత మొబైల్ రేషన్ పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాక రేషన్ లో భాగంగా..బియ్యం, గోధుమ, రాగులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈ మొబైల్ రేషన్ పంపిణీ పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. తాజాగా మొబైల్‌ రేషన్‌ పంపిణీ వాహనాలకు జీపీఎస్‌ అమర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. రేషన్‌ పంపిణీ, మొబైల్‌ వాహనాల పనితీరుపై జిల్లాల సంయుక్త కలెక్టర్లతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు.

నిత్యావసరాల పంపిణీపై ప్రతి నెలా జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్లు, మండల స్థాయిలో ఎమ్మార్వోలు సమీక్షలు నిర్వహించాలన్నారు. వాహనాలు ఇరుకైన వీధుల్లోకి వెళ్లే అవకాశం లేకపోతే.. వీధి చివరలోని నోటిఫై చేసిన ప్రాంతంలో సరకులు పంపిణీ చేయాలని తెలిపారు.. ఎండీయూ ఎక్కడైనా పాడైతే..ప్రతి నెల ఇచ్చే రూ.18 వేలతో పాటు, వాహన మిత్ర కింద ఇచ్చే రూ.10 వేలను వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సూచించారు. రేషన్‌ సరకులు సక్రమంగా అందడం లేదని లబ్ధిదారుల నుంచి సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎంవో అదనపు కార్యదర్శి భరత్‌గుప్తా తెలిపారు.

రేషన్ కి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే.. జిల్లా జేసీలే బాధ్యత వహించాలని సీఎస్ అన్నారు. రేషన్‌ సరకుల పంపిణీలో అక్రమాలకు, అవినీతికి  పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనాల ద్వారా ఇంటింటికీ కచ్చితంగా రేషన్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. పీడీఎస్‌ పంపిణీపై ప్రతినెలా ఎమ్మార్వో, జేసీ సమీక్ష చేయాలని సీఎస్‌ సూచించారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా తప్పక జరగాలి అన్నారు. మరి.. రేషన్ సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.