Dharani
అన్నా ఆదుకో అని పిలిస్తే చాలు.. పరుగున వచ్చి అక్కున చేర్చుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే ఎందరికో సాయం చేసిన ఆయన ఓ వ్యక్తి వైద్యం కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వం నుంచి హెల్ప్ చేసి మంచి మనసు చాటుకున్నారు. ఆ వివరాలు..
అన్నా ఆదుకో అని పిలిస్తే చాలు.. పరుగున వచ్చి అక్కున చేర్చుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే ఎందరికో సాయం చేసిన ఆయన ఓ వ్యక్తి వైద్యం కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వం నుంచి హెల్ప్ చేసి మంచి మనసు చాటుకున్నారు. ఆ వివరాలు..
Dharani
జీవితం ఎవరికి పూల బాట కాదు. పైకి నవ్వతూ కనిపించే వారి జీవితాల్లో కనపడని కష్టాలు ఎన్నో ఉంటాయి. చదువుకుని.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వారి జీవితాల్లో కూడా ఎప్పుడో ఓసారి ఇలాంటి పరిస్థితి తప్పకుండా ఎదురవుతుంది. అప్పటి వరకు మనం ఎంతో సేఫ్‌గా ఉన్నామనుకున్న పరిస్థితులు.. ఒక్కసారిగా తలకిందులు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయి అనే సామెత అప్పుడు నిజం అనిపిస్తుంది. ఎవరైనా ఆదుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి ముందుగా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు గుర్తుకు వస్తారు. కానీ ఏపీ ప్రజలకు మాత్రం.. సీఎం జగన్ గుర్తుకు వస్తారు. అన్నా అని పిలిస్తే చాలు ఎంత పెద్ద కష్టమైనా సరే.. నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడమే కాక.. వెంటనే వారిని ఆదుకుని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తన భర్త ప్రాణాలు కాపాడారు అని చెప్పుకొచ్చింది ఓ వైద్యురాలు. ఆ వివరాలు..
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ దంపతులు భాగ్యలక్ష్మి, భాస్కర్. వీరిద్దరూ వైద్యులు. భాగ్యలక్ష్మి గుంటూరు మెడికల్ కాలేజీలో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫసెర్‌గా పని చేస్తోంది. ఆమె భర్త భాస్కర్ నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చారు. అందుకే కష్టపడి చదివి.. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకుని.. ఓ ప్లాట్, 5 లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారు. జీవితం ఎంతో చక్కగా జరిగిపోతుందని భావించారు. అయితే అలానే సాగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలను కోవిడ్ తలకిందులు చేసింది.
ఇద్దరూ వృత్తి రీత్యా వైద్యులు కావడంతో.. కరోనా సమయంలో కూడా సేవలు అందించారు. ఇద్దరు డాక్టర్లే కావడంతో.. అన్నీ జాగ్రత్తలు తీసుకుని.. విధులు నిర్వహించారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో భాగ్యలక్ష్మి, భాస్కర్ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఆమె త్వరగానే కోలుకుంది.. కానీ భాస్కర్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. అతడి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అన్నారు. ఇక వారి చేతిలో ఉన్న 5 లక్షలు ఒక్క వారం చికిత్సకు కూడాసరిపోలేదు. ఇక భాస్కర్ పరిస్థితులు తెలుసుకున్న తోటి సహచరులు, బంధువులు, ఇతర డాక్టర్లు.. సాయం చేశారు. కానీ అది చాలా చిన్న మొత్తం.
ఆ సమయంలో వారి బంధువులు కొందరు గవర్నమెంట్ హెల్ప్ తీసుకోమన్నారు. దాంతో భాగ్యలక్ష్మి దంపతులు ముందుగా అప్పటి మినిస్టర్ బాలినేని శ్రీనివాస్ గారిని కలిసి వారి పరిస్థితి వివరించారు. ఆయన వెంటనే స్పందించి.. సీఎం జగన్ దగ్గరకి వాళ్లని తీసుకెళ్లారు. వీరి పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. కోవిడ్‌లో తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన సిబ్బందికి ఇలాంటి ఆపద వచ్చింది.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాక భాస్కర్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే భాస్కర్ చికిత్సకు అవసరమైన కోటి 17 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. ఈ రోజు తన భర్త భాస్కర్ బతికున్నాడు అన్నా.. తాము సంతోషంగా ఉన్నాము అన్నా.. అది సీఎం జగన చలవే అని చెప్పుకొచ్చింది భాగ్యలక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సీఎం జగన్ ఔదార్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.