iDreamPost
android-app
ios-app

ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి.. సీఎం జగన్ అభినందనలు!

  • Published Jul 14, 2023 | 1:55 PM Updated Updated Jul 14, 2023 | 1:55 PM
  • Published Jul 14, 2023 | 1:55 PMUpdated Jul 14, 2023 | 1:55 PM
ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి.. సీఎం జగన్ అభినందనలు!

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఆసియ అథెట్స్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసింది.  ఈ మెగా ఈవెంట్ లో గురువారం ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల  హర్డిల్స్ లో స్వర్ణం గెలిచింది. ఈ రేసును కేవలం 13.09 సెకన్లలో ముగించి ఛాంపియన్ గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో  100 మీటర్ల హర్డిల్స్ లో పసిడి పతకం అందుకున్న తొలి భారతీయ అథ్లెట్ గా జ్యోతి రికార్డు సృష్టించింది. స్వర్ణం గెలిచి దేశానికి మంచి పేరు తెచ్చిన జ్యోతిపై  దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జ్యోతి యర్రాజీకీ అభినందనలు తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ” వైజాగ్ కు చెందిన మన జ్యోతి యర్రాజీకి నా  అభినందనలు. 25వ ఆసియా అథ్లెటిక్స్  ఛాంపియన్ షిప్ లో పసిడి పతకం గెలిచి.. ఎవరికి సాధ్యం కానీ రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో దేశమంతా గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఇక ఈ ప్రదర్శనతో జ్యోతి..వచ్చే నెలలో బుడాపెస్ట్ లో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది.  ప్రస్తుతం  భువనేశ్వర్ లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ లో జేమ్స్ హీలియర్ అనే ఇంగ్లాండ్ చెందిన  కోచ్ వద్ద జ్యోతి ట్రైనింగ్ తీసుకుంటోంది.

గత రెండేళ్ల నుంచి జాతీయ,  అంతర్జాతీయ వేదికలపై జ్యోతి నిలకడగా రాణిస్తూ..పతకాలను సాధిస్తోంది.   గురువారం జరిగిన 100 మీటర్ల హార్డిల్స్ ఫైనల్ విభాగంలో జ్యోతి స్వర్ణం గెలిచి విజేతగా నిలవగా..  జపాన్ కు చెందిన అసుక తెరెదా రజత పతకం సాధించింది. అలానే జపాన్ కు చెందిన మరో అథ్లెట్ ఆకి మసుమి కాంస్య పతకం గెలిచింది. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్ పై జరిగిన ఈ ఫైనల్ రేసులో జ్యోతి తొలి నుంచి చివరి వరకు ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధిచింది. అలానే ఆసియా చాంపియన్ షిప్ లో భారత్ కి అరుదైన ఘనత తెచ్చి పెట్టింది. మరి.. విజేతగా నిలిచి.. ఎందరో యువతలకు స్ఫూర్తినిచ్చిన జ్యోతికి మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet