Dharani
చంద్రబాబు అండ్ కో స్వార్థం వల్ల ఏప్రిల్ నెల పింఛన్ల కోసం వృద్ధులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా మే నెల పింఛన్లకు సంబంధించి సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
చంద్రబాబు అండ్ కో స్వార్థం వల్ల ఏప్రిల్ నెల పింఛన్ల కోసం వృద్ధులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా మే నెల పింఛన్లకు సంబంధించి సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు.. ఇంటి వద్దకే వెళ్లి.. లబ్ధిదారులకు పింఛన్ అందజేసేవారు. కానీ చంద్రబాబు అండ్ కో స్వార్థం కారణంగా ఏప్రిల్ నెలపింఛన్ పంపిణీలో తీవ్ర గందరగోళ నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా సరే.. పింఛన్ కోసం సచివాలయాల వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. ఇక పింఛన్ కోసం వెళ్తు ఎండదెబ్బ కారణంగా కొందరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. బాబు అండ్ బ్యాచ్ వల్ల పింఛనుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను ఇంత ఇబ్బందికి గురి చేసిన బాబు అండ్ కోపై వృద్ధులు మండిపడ్డారు. తమను ఇంత ఇబ్బంది పెట్టిన బాబు బాగుపడడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రెండు రోజుల్లో మే నెల ప్రారంభం కానుంది. మరి ఈ నెల పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారు. ఇప్పుడు కూడా లబ్ధిదారులు సచివాలయాల వద్దకే వెళ్లాలంటే.. అది వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే.. ఈ నెల ఎండలు దారుణంగా ఉన్నాయి. ఏప్రిల్‌తో పోలిస్తే.. మేలో ఉఫ్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దాంతో పింఛన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మరి ఎలా అని ఆలోచిస్తున్న వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే నెల పింఛన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షన్ కోసం లబ్ధిదారులు.. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దనే పింఛన్ సొమ్ము అందించనున్నారు.
ప్రతి నెల ఏపీ వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు పొందుతున్నారు. వీరిలో సుమారు 48, 92,000 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దాంతో మే నెలలో వీరందరి పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం.. నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. మే 1-5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.