Vinay Kola
AP: లేడీ అఘోరీ కొత్త అవతారం ఎత్తింది. ఆంద్రప్రదేశ్ చేరుకొని హల్ చల్ చేసింది.
AP: లేడీ అఘోరీ కొత్త అవతారం ఎత్తింది. ఆంద్రప్రదేశ్ చేరుకొని హల్ చల్ చేసింది.
Vinay Kola
ప్రస్తుతం లేడీ అఘోరీ నాగసాధువు ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల చూపుని తన వైపు తిప్పుకుంటుంది. గతంలో తెలంగాణలో ఆమె ఎపిసోడ్ ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో అడుగుపెట్టిన అఘోరీ పలు ఆలయాలను సందర్శిస్తూ తెగ వైరల్ అవుతుంది. పలు ఇంటర్వ్యూస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ లలో అఘోరీ చెప్పిన విషయాలకు నెటిజన్లు షాక్ అయ్యారు. తాము శవాలను తింటామని చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే ఇటీవలే ఆత్మార్పణ చేసుకుంటానని మరో దిమ్మ తిరిగే షాకింగ్ విషయం చెప్పింది. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన ప్రాణాలనైనా అర్పిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.అందులో భాగంగానే నవంబర్ 1న సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ఆమె ప్రకటించింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు అఘోరీని వెంటనే అదుపులోకి తీసుకుని తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు అఘోరీని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ తరువాత మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. అయినా కానీ అక్కడితో ఆగలేదు అఘోరీ. మళ్ళీ పుబ్లిక్ లోకి వచ్చి సెన్సేషన్ అవుతుంది. ఎక్కడ చూసిన అఘోరీ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.. తాజాగా వైజాగ్ నగరంలో అడుగుపెట్టింది. అక్కడ కూడా సంచలనం అవుతుంది. వైజాగ్ జోడుగుళ్ళపాలెంలో హల్‌చల్ చేసింది. సోమవారం నక్కపల్లి టోల్‌గేట్ దగ్గర కారు ఆపేసి.. నిరసనకు దిగింది ఆమె. పోలీసులు వచ్చి చెప్పినా కూడా ఏమాత్రం వినలేదు.. అసలు తగ్గేదె లే అంది. అక్కడి నుంచి కదిలేది లేదని మొండికేసింది.
పోలీసులు తనతో సరిగ్గా ప్రవర్తించలేదని, మర్యాద లేకుండా తనను చేతులు పట్టి తోసేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై చేయి వేసిన వారిని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తన పట్ల టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. నాగ సాధుకే రక్షణ లేకపోతే, ఇక మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందుకే కలియుగం ఇలా మారిపోయిందని అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు రెండు గంటల పాటు హైడ్రామా సాగింది. ట్రాఫిక్‌కి బాగా అంతరాయం ఏర్పడింది. తరువాత పోలీసులు వచ్చి ఆమెకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అఘోరీని చూసేందుకు జనం భారీగా వచ్చారు. ప్రస్తుతం వైజాగ్ లో అఘోరీ చేసిన పూజ వీడియో తెగ వీరల్ అవుతుంది..నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసింది అఘోరీ. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పింది అఘోరీ. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి తనకు ఏమీ కాదని తెలిపింది. తన శక్తులు తెలుసుకోవాలంటే హిమాలయాలకు వస్తే కచ్చితంగా చూపిస్తానని తెలిపింది. తాను ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పింది.