iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో CM జగన్ క్రేజ్! ట్రెండింగ్ లో #YSJaganAgain

సోషల్ మీడియాలో CM జగన్ క్రేజ్! ట్రెండింగ్ లో #YSJaganAgain

ట్విట్టర్ లో ఇప్పుడు వైఎస్ జగన్ అగైన్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఈటీజీ టైమ్స్ నౌ వాళ్లు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సాసీపీ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గతంతో పోలిస్తే సీట్లు పెరగడం మాత్రమే కాదు.. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అంటూ వాళ్లు తెలియజేశారు. అయితే ఇది ఏదో అప్పటికప్పుడు చేసిన సర్వే కాదు.. ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసుకుని.. మూడో ఫేజ్ సర్వే ఫలితాలను కూడా తాజాగా ప్రకటించారు. ఈ సర్వేలో కూడా వైఎస్ జగన్ హవానే ఉంటుందని స్పష్టమైంది.

ఈ సర్వే తర్వాత జగన్ స్టామినా ఏంటో జాతీయస్థాయిలో తెలిసినట్లు అయింది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వైఎస్ జగన్ మీద వ్యతిరేకత ఉంది అని ప్రచారాలు చేసిన వారందరికీ ఇదొక చెంపపెట్టు అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇది చేసింది సాధారణమైన న్యూస్ ఛానల్ వాళ్లు కాదు. జాతీయస్థాయిలో ఒక క్రెడిబిలిటీ, స్థానం కలిగిన మీడియా సంస్థ వెల్లడించడంతో అందరికీ జ్ఞానోదయం అయినట్లు అయింది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో అందరికీ తెలిసవచ్చినట్లు అయింది. సీఎం జగన్ సంక్షేమ పథకాలు గురించి, తీసుకున్న పరిపాలన గురించి ప్రజలు చెప్పే మాటలను కూడా కొందరు అబద్ధాలు అంటూ ప్రచారం చేస్తున్నారంటూ జగన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అంటూ గట్టిగానే ప్రచారం చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కానీ, ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేతో అసలు కథ ఏంటో అందరికీ తెలిసి వచ్చినట్లు అయింది అంటున్నారు. అంతేకాకుండా 2019లో 22 ఎంపీ స్థానాలు సాధించిన వైసీపీ ఇప్పుడు 2024లో 24 నుంచి 25 స్థానాల వరకు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పడం పార్టీలోనే కాకుండా ఆంధ్రా ప్రజల్లో కొత్త జోష్ నింపినట్లు అయింది. అందరూ ఇది కదా సీఎం వైఎస్ జగన్ స్టామినా అంటూ నెట్టింట పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా తర్వాత కూడా కచ్చితంగా జగనే సీఎం అవుతాడు అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ సర్వే వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు మబ్బులు వీడాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్లు చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని, ఇది అసలు కథ అంటూ చెబుతున్నారు. జగన్ చేసే మంచి.. సంక్షేమ పథకాలే ఆయను తిరిగి అధికారంలోకి తీసుకుని వస్తాయంటున్నారు. ఈ సర్వే ద్వారా సీఎం జగన్, వైసీపీ రియల్ స్టామినా అందరికీ తెలిసిందంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో మాత్రం #YSjaganAgain అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది.