iDreamPost
android-app
ios-app

మరోసారి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది: నటుడు సుమన్‌

మరోసారి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది: నటుడు సుమన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం పరి తపించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండిటిని  జోడెద్దుల పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం జగన్.. ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అలానే రాష్ట్రానికి ఎన్నో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలను కల్పించారు. ఈ విధమైన సుపరిపాలన వలన ప్రజల్లో సీఎం జగన్ ప్రత్యేక స్థానం సంపాదించారు. మరోసారి.. కూడా  ఆయనకే అధికారం ఇస్తామంటూ ప్రజలు అంటున్నారు. ఇటీవల వచ్చిన –జాతీయ సర్వేల నివేదికలు కూడా వైసీపీ గెలుస్తుందని వెల్లడించారు.

సీఎం జగన్ మరోసారి అధికారం చేపడతారని పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా సినీ నటుడు సుమన్ కూడా సీఎం జగన్ మళ్లీ సీఎం అవుతారని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో మరోసారి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సుమన్‌ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌ని సీఎం చేయనున్నారన్నారు.

గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదన్నారు. అలానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల వారికి సముచిత న్యాయం జరిగిందని.. స్వయంగా ఆ వర్గం వారే చెబుతున్నారని సుమన్ తెలిపారు. నవరత్నల ద్వారా అన్ని పథకాలను 95 శాతం అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని తెలిపారు. మొత్తానికి మళ్లీ జగనే సీఎం అవుతారని సుమన్ చెప్పిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.  మరి.. హీరో సుమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş